కరడుగట్టిన తీవ్రవాద ముఠాగా పేరున్న తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో అక్కడి ప్రజలు భీతావహులై.. దేశాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘాన్‌లో కనీవినీ ఎరుగని.. కల్లోలం చోటు చేసుకుంది. అయితే.. దీనికి ఇప్పటి వరకు ప్రపంచం.. తాలిబన్లే.. కారణమని భావిస్తోంది. తాలిబన్లు బలం పెంచుకున్నారని.. అందుకే ఆఫ్ఘాన్‌ను ఆక్రమించుకున్నారని.. ప్రపంచం యావత్తు విశ్వసిస్తోంది. అయితే.. ఇలాంటి సమయంలో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఒక సంచలన ప్రకటన జారీ చేసింది. అదేంటంటే.. అసలు తాలిబాన్ల దూకుడు వెనుక అమెరికా ఉందని.. అమెరికా ప్రోత్సాహంతోనే తాలిబాన్లు రరెచ్చిపోయారని.. సంచలన ప్రకటనలు జారీ చేసింది.
ఇప్పుడు ఐఎస్ చేసిన ఈ ప్రకటనలు ప్రపంచం విస్తుపోయేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నది 20 సంవత్సరాల కిందటి ముల్లా ఒమర్ నాయకత్వంలోని తాలిబాన్ కాదని ఐఎస్ మద్దతుదారులు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తాలిబాన్ పూర్తిగా మారిపోయిందని, ఈ ప్రాంతంలో జిహాద్‌ను అణగదొక్కడానికి అమెరికా ప్రణాళికలను రహస్యంగా అమలు చేస్తోందని చెబుతున్నారు. ఆగస్టు 19 ఐఎస్ అధికారిక ప్రకటనలో, తాలిబాన్లను "ముల్లా బ్రాడ్లీ" ప్రాజెక్ట్ అని సంభోధించింది. ముల్లా బ్రాడ్లీ ప్రాజెక్ట్ అంటే.. జిహాదీ ఉద్యమాన్ని లోపలి నుంచే నిర్వీర్యం చేసేందుకు అమెరికాయే స్వయంగా కొందరు జిహాదిస్టులను రంగంలోకి దించడం.
అమెరికా నియమించిన వాళ్లు వీళ్లు అంటూ.. కొందరు ముస్లిం ప్రముఖులను ప్రస్తావిస్తూ ఎంతో కాలంగా జిహాదిస్టులు ఈ ప్రాజెక్టును ఉటంకిస్తున్నారు. ఈ విషయంపై ఐఎస్ మద్దతుదారుడు.. రాబర్ట్ ఎల్ గ్రేనియర్ కొన్ని విషయాలను తెరమీదికి తెచ్చారు. తాలిబాన్ల "నిజ స్వరూపం" చూపిస్తానంటూ ఆగస్టు 19న కొన్ని పేజీల డాక్యుమెంట్లను, ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. 2001లో అమెరికా తాలిబాన్లపై దాడి చేసి, ఆఫ్ఘాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ముందు తాలిబాన్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ఎలా చర్చలు జరిపేందుకు తాను ప్రయత్నించినట్టు తెలిపారు. ఆయన రాసిన "88 డేస్ టు కాందహార్" పుస్తకంలో ప్రస్తావించిన అంశాలను కూడా ఈ వీడియోలో పేర్కొన్నారు.
గ్రేనియర్ వ్యాఖ్యల ఆధారంగా.. తాలిబాన్ సంస్థ, దాని వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కాలంనాటితో పోల్చితే మారిపోయిందని, అమెరికాతో రహస్య ఒప్పందాల ద్వారా ముజాహిదీన్‌కు నమ్మకద్రోహం చేసిందని కూడా ఈ వీడియోలో ఉంది. జిహాదీలతో పోరాడే స్థానిక ఆఫ్ఘాన్ దళాన్ని, భాగస్వామిని కనుగొనాలని అమెరికా కోరుకుంటోందని, తాలిబాన్లు ఆ పాత్రను చేపట్టాలని అమెరికా భావిస్తోందని గ్రేనియర్ పేర్కొన్న ఒక క్లిప్ కూడా ఈ వీడియోలో ఉంది.
అంతేకాదు, "అమెరికా తన ప్రణాళికను కొత్త తాలిబాన్ నాయకత్వం ద్వారా అమలు చేయగలిగింది. ఈ నాయకత్వం ముల్లా ఒమర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతాం అని ప్రతిజ్ఞ చేసింది. ఈ ప్రణాళికతో, వారు ఇస్లామిక్ ఖలీఫా స్థాపనను ఆపాలని కోరుకుంటున్నారు. తద్వారా ఆఫ్రికా, ఇరాక్, సిరియా, తూర్పు ఆసియాతోపాటూ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్‌తో పోరాటం అమెరికాకు సులభం అవుతుంది`` అని పేర్కొన్నాడు. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే.. తాలిబన్ల వెనుక అమెరికా ఉందనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.