అమెరికా, నాటో దళాలు అఫ్గాన్ నుండి వెనక్కి తగ్గడం తో అక్కడ తాలిబన్లు మళ్లీ విజృంబిస్తున్నారు. అఫ్గాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోన్నారు. అమెరికాలో జో బైడన్ ప్రెసిడెంట్ గా భాద్యతలు స్వీకరించిన తర్వాత ఆప్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా అమెరికా బలగాలను ఉపసంహరించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనితో గతంలో అమెరికాపై అల్ ఖైదా జరిపిన 9/11 దాడుల తర్వాత ఆప్ఘన్ లో తిష్టవేసిన యూఎస్ బలగాలు వెనుదిరగడం మొదలుపెట్టాయి. దీనితో అప్పటివరకూ మూలనపడిన తాలిబన్లు తిరిగి ఆప్ఘనిస్తాన్ లో పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాయి. అమెరికా బలగాల ఉపసంహరణతో ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం వర్సెస్ తాలిబన్లుగా అక్కడ పోరు మారింది. దీనితో ఆప్ఘన్ సైన్యంపై విరుచుకుపడుతున్న తాలిబన్లు తిరిగి పునర్ వైభవం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
అఫ్గానిస్థాన్ నుండి అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో గతంలో స్థావరాలుగా ఉన్న ప్రాంతాలను మళ్లీ వారి అధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకు ప్రత్యక్ష యుద్దం మొదలుకానప్పటికీ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనితో అప్రమత్తమైన కొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ సమయంలో అఫ్గాన్ రాజధాని కాబూల్ లోగల రాయబార కార్యాలయాన్ని భారత్ కూడా మూసేయబోతోందని, కాన్సులేట్, రాయబార సిబ్బందిని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ వార్తల పై స్పందించిన భారత విదేశాంగ శాఖ అఫ్గాన్ లో రాయబార కార్యాలయం, కాన్సులేట్ లు ప్రస్తుతానికి యథావిధిగా పనిచేస్తాయని ఓ ప్రకటన విడుదల చేసింద. అయితే, మరోవైపు అక్కడి భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.
ఇదిలా ఉంటే .. అఫ్గాన్ నుంచి అమెరికా సైనిక సేనలు వెళ్లిపోయిన నేపథ్యంలో అక్కడ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల భద్రతపై ఆయా దేశాలు ఆందోళన పడుతున్నాయి. తాలిబన్లు దాడులకు తెగబడతారనే భయంతో అఫ్గాన్ ప్రభుత్వ అధికారులే తమ కార్యాలయాలను మూసేస్తున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్ సైనికులు సైతం పక్కనున్న తజకిస్థాన్ లాంటి దేశాలకు పారిపోతుండటంతో అక్కడి పరిస్థితి ఏమిటో వివరించవచ్చు. తాలిబన్లు మరోసారి విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే తాలిబన్ బలగాలు బాగ్రం వైమానిక స్థావరంపై దాడి చేస్తాయని అఫ్గాన్ మిలటరీ జనరల్ కొహిస్తాని అంచనా వేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్ల కదలికలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ బలగాలు వెళ్లిపోయినప్పటికీ బాగ్రం వైమానిక ప్రాంతాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు.