అంత ర‌హ‌స్యంగా భేటీ ఏమిటి షా?

Update: 2018-09-01 10:35 GMT
ప్ర‌స్తుతం మీడియా - సోష‌ల్ మీడియా విప‌రీతంగా యాక్టివ్ గా ఉన్న నేప‌థ్యంలో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయిన క్ష‌ణాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఇక పార్టీల‌కు సంబంధించిన కీల‌క వ్య‌క్తుల భేటీలు - స‌మావేశాల గురించి లైవ్ క‌వ‌రేజీలు ష‌రామామూలే. అయితే, ప్ర‌స్తుతం ఉన్న మీడియా ట్రెండ్ కు విభిన్నంగా జరిగిన ఓ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సాక్ష్యాత్తు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజ‌రైన ఓ కార్య‌క్ర‌మం మీడియా క‌వ‌రేజి లేకుండా....క‌నీసం ఒక్క ఫొటో క్లిక్ చేయ‌కుండా ముగిసిపోయింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో ఆరెస్సెస్ అగ్ర‌నేతలంతా హాజ‌రైన ఆ కార్య‌క్ర‌మం గురించి మీడియాకు క‌నీస స‌మాచారం కూడా అంద‌లేదంటే ...ఎంత సీక్రెసీ మెయింటెన్ చేశారో అర్థ‌మ‌వుతోంది. అస‌లు ,అంత‌ రహస్యంగా ఆ భేటీ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఇపుడు మీడియా వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

క‌ర్నూలు జిల్లా మంత్రాలయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశాలు జరుగుతున్నాయి. అఖిల భారత క్షేత్ర సమన్వయ భైఠక్ పేరుతో 3 రోజుల పాటు జర‌గ‌నున్న ఈ సమావేశాలకు  షాతో పాటు ఆరెస్సెస్ అగ్ర‌నేత‌లు హాజ‌ర‌య్యారు. అయితే, ఆ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తోన్నట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం.... ఆరెస్సెస్ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తోంద‌ని టాక్ కూడా ఉంది. మ‌రోవైపు, ప్రభుత్వ వైఫల్యాలు - ప‌నితీరుపై ఆరెస్సెస్ అగ్రనేతలు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు పుకార్లు కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుప‌న‌కు వ్యూహ రచ‌న చేసేందుకే వారంతా భేటీ అయిన‌ట్లు  తెలుస్తోంది. 2019లో మ‌రోసారి అధికారం చేప‌ట్టేందుకు త‌మ ట్రంప్ కార్డ్ అయిన‌.....హిందుత్వ ఎజెండాను తెర‌పైకి తేవాల‌ని చర్చ‌జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కోర్టు ప‌రిధిలో ఉన్న రామ‌ మందిర నిర్మాణం అంశంతో పాటు..మరికొన్ని బీజేపీ మార్క్ విషయాలపై చ‌ర్చించార‌ట‌. కేంద్రం తీసుకుంటోన్న వివాదాస్పద నిర్ణయాలపై కూడా చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తిగా ప్రైవేట్ గా నిర్వ‌హించార‌ట‌. మ‌రి, బీజేపీ-ఆరెస్సెస్ వ్యూహాలేమిటో తెలియాలంటే మ‌రికొంత‌కాలం వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News