దేశానికి ‘‘అమ్మ’’ ఉప్పు

Update: 2015-09-06 04:42 GMT
తన సంక్షేమ కార్యక్రాలతో తమిళ ప్రజల మనసుల్ని దోచుకుంటున్న అమ్మ.. తన కార్యక్రమాల్ని దేశ వ్యాప్తం చేసే ప్రయత్నంలో తొలి అడుగు వేశారు. తమిళ ప్రజలు తనను ఎంతో అభిమానంగా పిలుచుకునే ‘‘అమ్మ’’ పేరును బ్రాండ్ గా మార్చుకొని చెలరేగిపోవటం తెలిసిందే. అమ్మ పేరు మీద ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా తమిళనాడులు సుపరిచితమైన అమ్మ ఉప్పును దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేయాలని డిసైడ్ చేశారు.

ఇప్పటికే తమిళనాడులో అమ్మ ఉప్పునకు బహుళ ప్రజాదరణ ఉంది. ఒక్క అమ్మ ఉప్పేంటి.. అమ్మ సిమెంట్.. అమ్మ మంచినీళ్లు.. అమ్మ హోటల్.. అమ్మ మెడికల్ షాపు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ పేరు మీద చాలానే ఉన్నాయి. వాటిల్లో అమ్మ ఉప్పును దేశ వ్యాప్తంగా మార్కెట్ చేయటం ద్వారా.. బ్రాండ్ కు బ్రాండ్.. ఆదాయానికి ఆదాయం బాగానే సమకూరుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతానికి అమ్మ ఉప్పును తమిళనాడుతో పాటు.. కర్ణాటక.. కేరళ.. మహారాష్ట్ర.. పంజాబ్.. రాజస్థాన్.. గుజరాత్.. ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో మార్కెట్ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తొలిదశలో తెలుగు రాష్ట్రాలపై అమ్మ కన్ను పడలేదెందుకో..?
Tags:    

Similar News