హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా.. ప్రారంభమైన టీఆర్ ఎస్ ప్లీనరీపై విశ్లేషకులు ఆసక్తికర కామెంట్లు చేస్తు న్నారు. పార్టీ అధ్యక్షుడిగా మరోసారి పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్.. తన ప్రసంగంలో ఎక్కడా.. భవిష్య త్ ప్రణాళికపై కానీ.. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ.. ఆయన ప్రస్తావించలేదు. తనను, తన ప్రభుత్వాన్ని పొగుడుకుంనేందుకే పరిమితమయ్యారు. అదేసమయంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. గతంలో తాను పార్టీ ప్రారంభించినప్పుడు ఉన్న పరిస్తితులను ఆయన చెప్పుకొచ్చారు. పార్టీని ప్రారంభించేందుకు అనేక కష్టాలు ఎదుర్కొన్నామన్న కేసీఆర్. ఎన్నో ఇబ్బందులను తట్టుకుని ముందుకు సాగామని చెప్పారు.
ఈ క్రమంలోనే తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. అయినప్పటికీ.. పార్టీని నిలదొక్కుకు నేలా చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు నిద్ర పోలేదన్నారు. ఇలాంటి పోరాట పటిమ కేవలం తనకు మాత్రమే సాధ్యమైందనే రీతిలో స్వోత్కర్షలకు ప్రాణంపోశారు. అదేసమయంలో రాష్ట్ర సాధనకు వారు అడ్డుపడ్డారంటూ.. ఇతర పార్టీలపై నిందలు వేసేందుకు సమయం కేటాయించారు. తాము సభ పెట్టినా.. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినా.. కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించారంటూ.. నిప్పులు చెరిగారు. ఇదేసమయంలో రాజ్యంగ సంస్థలైన ఎన్నికల సంఘంపైనా.. కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న కిరికిరితో తాము అడుగులు వేయలేక పోతున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. ఎన్నికల సంఘం ఏం చేసినా.. నవంబరు 4 తర్వాత.. దళిత బంధును ఆపలేదన్న కేసీఆర్.. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని.. చెప్పుకొచ్చారు.ఆడించేందుకు మిల్లులు సరిపోనంత.. మోసేందుకు హమాలీలు దొరకనంతగా తాము.. వరిని పండించామని.. కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇదే సమయంలో ఆయన రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను ప్రస్తావించలేదు. అదేవిధంగా నిరుద్యోగాన్ని ప్రస్తావించలేదు. ఇక, ఇటీవల ముఖ్యమంత్రిగా తనపై వస్తున్న వ్యతిరేకతను చాటి చెప్పిన ఒక సర్వే గురించి ప్రస్తావన లేదు.
అన్నింటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం పెట్రోల్ ధరలు పె రిగిపోతున్నాయి. దీనివల్ల ఇతరనిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో సామాన్యుల జీవనం కనాకష్టంగా మారిపోయింది. మరి వాటిని కూడా ఈ ప్లీనరీలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని.. ఆయా సమస్యలకు తన ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందనే విషయాన్ని కేసీఆర్ చెప్పి ఉంటే.. సమగ్రంగా ఉండేదని.. విశ్లేషకులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన... ప్లీనరీ కేవలం.. స్వోత్కర్షలకు పరనిందలకు మాత్రమే పరిమితమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కేసీఆర్ తన ప్రసంగాన్ని వండి వార్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు.