కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. అయినప్పటికీ కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా ని విస్తరించకుండా అడ్డుకునేందుకు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల తో అనేక కార్పొరేట్ సంస్థలు తమ వంతుగా ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆనంద్ మహీంద్రా ...కరోనా పేషేంట్స్ కోసం అధునాతన వెంటిలేటర్లని తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. చెప్పినట్టుగానే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నాణ్యమైన వెంటిలేటర్ల తయారీని చేపట్టింది.
తాజాగా మరో అడుగు ముందుకేసిన సంస్థ త్వరలోనే వెంటిలేటర్లను అందుబాటులోకి తేనున్నామని వెల్లడించింది. ఈ విషయంలో తమకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని సంస్థ ఎండీ పవన్ గోయంకా గురువారం ఒక ట్వీట్లో తెలిపారు. వెంటిలేటర్ల తయారీకి సంబంధించి రెండు ప్రభుత్వ రంగ విభాగాల భాగస్వామ్యం తో ఇప్పటికే ఉన్న హై-స్పెక్ తయారీదారుతో కలిసి పనిచేస్తున్నామని , ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు.
డిజైన్ ను, సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా ఇప్పటికే ఉన్న తయారీ సంస్థలతో చర్చిస్తున్నామనీ.. ఇందుకు తమ ఇంజనీరింగ్ బృందం కృషి చేస్తోందని తెలిపారు. మరోవైపు బాగ్ వాల్వ్ మాస్క్ లేదా అంబు బ్యాగ్ తయారీపై దృష్టిపెట్టాం. మరో మూడు రోజుల్లో దీని డిజైన్ సిద్ధమవుతుందని ఆశిస్తున్నాం. ఈ డిజైన్ కి ఆమోదం లభించిన తయారీ అందరికీ అందుబాటులో ఉంటుందని పవన్ గోయంకా ట్వీట్ చేశారు. ఇకపోతే కరోనాపై పోరాటానికి ఆనంద్ మహీంద్రా తన 100 శాతం శాలరీని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.