టీ.బార్ కాన్సిల్ తొలి ఎన్నిక‌...బీజేపీ ఖాతాలో!

Update: 2018-11-25 07:15 GMT
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఏ నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో రెండు ఓట్ల స్వల్ప తేడాతో తన ప్రత్యర్థి గండ్ర మోహన్‌రావుపై గెలుపొందారు. మొత్తం 26 మంది బార్ కౌన్సిల్ సభ్యులుండగా.. 14 మంది నర్సింహారెడ్డికి, 12 మంది మోహన్‌రావుకు అనుకూలంగా ఓట్లు వేశారు. వైస్‌చైర్మన్‌గా కే సునీల్‌గౌడ్ ఎన్నికయ్యారు. వీరు రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎన్నికైన‌ నర్సింహారెడ్డిని బీజేపీ బ‌ల‌ప‌ర్చింది. కాగా, గండ్ర మోహ‌న్ రావును టీఆర్ఎస్ బ‌ల‌ప‌ర్చింది. హోరాహోరిగా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల‌ను ఆయా పార్టీలు సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది. వరుసగా మూడవసారి బార్ కౌన్సిల్ చైర్మన్‌గా నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి నర్సింహారెడ్డి గెలుపుతో బీజేపీ ఓ ప్ర‌త్యేక రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బార్ కౌన్సిల్ చైర్మ‌న్‌గా నిలిచిన లాయ‌ర్‌, తెలంగాణ‌లో తొలి బార్ కౌన్సిల్ చైర్మ‌ణ్ కూడా బీజేపీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థి అనే రికార్డును కాషాయ పార్టీ కైవ‌సం చేసుకుంది.
Tags:    

Similar News