విపక్షాలు నిరసన చేయకూడదా?

Update: 2015-09-16 10:27 GMT
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే కాస్తంత చిత్రంగా ఉన్నాయి. ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ.. నిరసనలు.. ధర్నాలు చేయటం మామూలే. కాస్తంత పేరు ప్రఖ్యాతులున్న నేతలు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే.. ఎక్కడా లేని విధంగా ఏపీలో విపక్ష నేతల విషయంలో చంద్రబాబు సర్కారు చిత్రమైన విధానాన్ని అమలు చేస్తోంది.

ప్రభుత్వ విధానాలపై ఎవరైనా నిరసన చేపట్టాలన్నా.. ధర్నా చేయాలని భావించినా.. సరిగ్గా ఆ సమయానికి సదరు నేత ఇంటికి వచ్చేస్తున్న పోలీసులు వారిని బయటకు వెళ్లేందుకు అనుమతించటం లేదు. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇదే విధంగా ఇంట్లోనే ఉంచేసి.. ఆయన పాదయాత్రను అడ్డుకోవటం తెలిసిందే.

తాజాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఇంటికే పరిమితం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలో జరిగిన సూరయ్య అనే రైతు హత్య కేసులోనిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. నిరసన ప్రదర్శన చేపట్టేందుకు బయలుదేరిన అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు అడ్డుకొని.. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. విపక్ష నేతలు ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదన్నట్లుగా పోలీసుల వైఖరి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News