సవాళ్లు చేయడంలో అనంత నేతల తరువాతే ఎవరైనా..ఎందుకబ్బా?

Update: 2019-11-27 08:51 GMT
రాజకీయాలలో సవాళ్లు  - ప్రతి సవాళ్లు అనేవి ప్రభుత్వం - ప్రతిపక్షాల నేతల మధ్య సర్వ సాధారణం. ప్రభుత్వం పై ప్రతిపక్షం నేతలు - ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఇలాంటి విమర్శలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయాయి. ఏ మాత్రం సందు దొరికినా రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. కానీ , ఏపీలోని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రం నేను అందరు వెళ్లే దారిలో నడవను..నా దారి రహదారి అంటున్నారు. తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పై ప్రతి విమర్శ చేయకుండా .. దమ్ముంటే నువ్వు చేసిన ఆ ఆరోపణలని నిరూపించు .. అలాగే నేను చేసిన అవినీతి పై సీఐడీ - ఏసీబీ లతో విచారణ జరిపించు అని , ఆ విచారానికి పూర్తిగా సహకరిస్తా అని  ..నేను దోషిని నిరూపిస్తే సన్మానం కూడా చేస్తానని సవాల్ విసిరారు. ఇంతకీ ఈ రేంజ్ లో సవాల్ విసిరిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు ? ఏ నియోజకవర్గం లో ఇదంతా జరిగింది ? అనేది ఇప్పుడు చూద్దాం ...

ఏపీ రాజకీయాలలో అనంతపురం జిల్లా ఎప్పుడు హాట్ టాపికే. తాజాగా ఈ జిల్లాలో పొలిటికల్ హీట్  పెరుగుతోంది. ఒకప్పటి స్నేహితులు ..ప్రస్తుత ప్రత్యర్థులు ..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరు ఆంటే ఒకరు అనంతపురం అర్బన్ నియోజకవర్గం అనంత వెంకట్రామిరెడ్డి కాగా , మరొకరు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే. అనంతపురం అర్బన్ .. జిల్లా కేంద్రం కావడంతో ఎక్కువగా అక్కడ రాజకీయాలు ఎన్నికల సమయంలో తప్ప ..మిగిలిన రోజుల్లో పెద్దగా కనిపించవు. కానీ , తాజగా అక్కడి పరిస్థితి చూస్తే ..ఆ పరిస్థితి లో మార్పు వచ్చినట్టు అర్థమౌతుంది.

ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి  - మాజీ ఎమ్మెల్యే  ప్రభాకర్ చౌదరి ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. కానీ , ప్రస్తుతం ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఒకే పార్టీలో పనిచేసినప్పుడు వీరి మధ్య ఉన్న స్నేహంతో ..ఎప్పుడు కూడా పెద్దగా హద్దులు దాటి ఒకరి పై ఒకరు  విమర్శలు చేసుకోలేదు. కానీ , ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఐదేళ్లలో అనంతపురం నగరాన్ని సర్వం నాశనం చేశారని అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శిస్తే … బదులుగా మాజీ ఎమ్మెల్యే మేము అభివృద్ధి చేయకపోతే .. ఇప్పుడు మీరు రాగానే ఓపెనింగ్స్ ఎలా చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

అలాగే నేను అవినీతి చేసినట్టు మీకు అనిపిస్తే .. సిఐడీతో కాని - ఏసీబీతో విచారణ చేయించాలని - వారికి నేను పూర్తిగా సహకరిస్తానని - అలాగే నేను అవినీతి చేసినట్టు  నిరూపించిన వారికి సన్మానం చేస్తానంటూ సవాల్ విసిరారు. దీనిపై డైరెక్ట్ గా ఎమ్మెల్యే అనంత స్పదించలేదు కానీ ..అయన అనుచరులు మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ పై రెచ్చిపోయారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గాన్ని నాశనం చేసి ..మళ్లీ ఇప్పుడు నీతులు చెప్తున్నావా అని - అలాగే నీకు ఎమ్మెల్యే ని విమర్శించే అర్హత కూడా లేదు అని ప్రభాకర్ పై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ప్రభాకర్ చౌదరి డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ , అయన అనుచరులు మాత్రం ఎమ్మెల్యే పై  విమర్శలు గుప్పించారు. మొత్తంగా విమర్శ  - ప్రతి విమర్శల తో అనంతలో  రాజకీయం హీటెక్కిపోతుంది.


Tags:    

Similar News