క‌శ్మీర్‌ లో ఎన్నిక నిర్వ‌హించ‌లేని దుస్థితి

Update: 2017-05-02 06:30 GMT
ద‌శాబ్దాల త‌ర‌బ‌గి ర‌గులుతున్న జ‌మ్మూక‌శ్మీర్ స‌మ‌స్య అంత‌కంత‌కూ పీట‌ముడి ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో క‌శ్మీర్ ఇష్యూ తెర మీద‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ.. డైన‌మిక్ పీఎం కానీ ప్ర‌ధాని ప‌ద‌విలో ఉంటే.. దాని సంగ‌తి తేల్చేసేవార‌న్న మాట వినిపించేది. మోడీని బీజేపీ పీఎం అభ్య‌ర్థిగా ఫైన‌లైజ్ చేసిన స‌మ‌యంలో ప‌లువురు.. క‌శ్మీర్ స‌మ‌స్య‌కు ఆయ‌న ప‌రిష్కారం చూపిస్తార‌ని.. అప్ప‌ట్లో ఉన్న ప‌రిస్థితుల కంటే మెరుగైన ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌న్న వాద‌న వినిపించింది.

అయితే.. గ‌డిచిన మూడేళ్లుగా చోటు చేసుకున్న ప‌రిణామాల్ని చూస్తే.. ఆ ఆశ‌లు నిజం కాలేద‌న్నది అర్థ‌మ‌వుతుంది. క‌శ్మీర్ ప‌రిస్థితి ఎంత దారుణంగా త‌యారైందంటే.. ఇప్పుడు అక్క‌డ ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించ‌లేని దుస్థితి. ఏప్రిల్ లో నిర్వ‌హించాల్సిన ఉప ఎన్నిక‌ను అప్ప‌ట్లో ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా వాయిదా వేసి.. మే 25న నిర్వ‌హించాల‌ని డిసైడ్ చేశారు. అయితే.. తాజాగా చోటు చేసుకున్న అల్ల‌ర్లు.. భ‌ద్ర‌తా సిబ్బంది.. ఆందోళ‌న‌కారుల మ‌ధ్య చోటు చేసుకుంటున్న ఘ‌ర్ష‌ణ‌ల తీవ్ర‌త అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టంతో ఇప్పుడు ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌లేమ‌ని ఈసీ తేల్చేసింది.

దీంతో.. మే 25న జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల్ని మ‌రోసారి వాయిదా వేస్తూ తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించాలంటే 74వేల మంది పారామిల‌ట‌రీ ద‌ళాల్ని మొహ‌రించాల్సి ఉంటుంద‌ని.. ఆ మొత్తంలో భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర హోం శాఖ‌ను ఈసీ కోర‌గా.. త‌క్కువ వ్య‌వ‌ధిలో అంత పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ద‌ళాల్ని మొహ‌రించ‌టం అంత తేలికైన విష‌యం కాద‌ని తేల్చ‌టంతో.. ఉప ఎన్నిక‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో 30 వేల భ‌ద్ర‌తా సిబ్బందిని మాత్ర‌మే ఏర్పాటు చేయ‌గ‌ల‌మ‌ని హోం శాఖ స్ప‌ష్టం చేయ‌టంతో.. అనంత్ నాగ్ ఉప ఎన్నిక‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఎన్నిక‌ను ఎప్పుడు నిర్వ‌హించాల‌న్న‌ది నిర్ణ‌యించ‌లేద‌ని.. త్వ‌ర‌లో తేదీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. క‌శ్మీర్‌లో ప‌రిస్థితి ఇంత‌గా దిగ‌జారిపోవ‌టం.. అదీ మోడీ హ‌యాంలో కావ‌టంపై ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. క‌శ్మీర్ ఇష్యూ వ‌ర‌కూ మ‌న్మోహ‌న్ అయినా మోడీ అయినా ఒక్క‌టేనా? అన్న విమ‌ర్శ వినిపిస్తోంది. ఇలాంటివి మోడీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తాయ‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News