తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే.. టీడీపీకి కంచుకోట. గత 2018 ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ ఓడిపోయినా.. ఇక్కడి రెండు నియోజకవర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. అయితే. వారు తర్వాత టీఆర్ ఎస్ గూటికి చేరిపోయారు! అది వేరే సంగతి. ఇక ఇప్పుడు తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చారు.
భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరారు.అయితే,, అడుగడుగునా.. పార్టీ అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. పార్టీకి పూర్వవైభవంతోపాటు శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా టీడీపీ శంఖారావం పేరుతో.. ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది.
దీనిలో పాల్గొనేందుకు శ్రేణులతో కలిసి ఖమ్మం బయల్దేరిన ఆయన మార్గమధ్యలో బేగంపేట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం.. ఉప్పల్ కూడలి వద్ద చంద్రబాబుకు నేతలు ఘనస్వాగతం పలికారు. వనస్థలిపురంలో గజమాలతో టీడీపీ శ్రేణలు సత్కరించారు. అంతేకాదు.. పరిసరాలన్నీ.. పసుపు జెండాలు కట్టడంతో పసుపు మయంగా మారిపోయింది.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ఖమ్మం నగరంలో పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఎటు చూసినా జెండాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. ఉమ్మడి ఖమ్మం సహా రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు పసుపు చీరలు ధరించి సభలో పాల్గొనేందుకు వస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.