ఆంధ్రప్రపదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అరగంటలోనే ముగిశాయి. జీఎస్టీ బిల్లుపై చర్చకు అధికార తెలుగుదేశం ప్రభుత్వం చర్చకు పట్టుబట్టింది. అయితే సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ రైతుల కోసం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. మిర్చి రైతులను ఆదుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ సభ్యులు స్పీకర్ కు ప్రతిపాదన ఇచ్చారు. అయితే స్పీకర్ కోడెల శివప్రసాద రావు తిరస్కరించారు. దీనికి నిరసనగా వైసీపీ సభ్యలు నినాదాలు చేశారు. అవినీతి సీఎం, రైతుల సమస్యలు పట్టని ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు.
విపక్ష వైసీపీ సభ్యుల నినాదాల మధ్యనే సభా కార్యక్రమాలను స్పీకర్ చేపట్టారు. ఇటీవల మరణించిన మాజీ సభ్యుల సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చ మొదలుపెట్టారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అధికార టీడీపీ, మిత్రపక్ష బీజేపీ సభ్యులు ప్రసంగించి మద్దతు పలికారు. అనంతరం సభలో బిల్లుకు ఆమోదం తెలిపారు. పీవీ సింధుకు సబ్ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణ ఒకటి మాత్రం చేశారు. ఆ తరువాత సభ జీఎస్టీ బిల్లును ఆమోదించింది. వెంటనే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
అంతేకానీ... విపక్షం లేవనెత్తిన ఏ అంశంపైనా కనీసం స్పందించలేదు.
కాగా, సభ ప్రారంభం అయిన అనంతరం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. సభలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. కాగా, ఏపీలో ఎండల కంటే రైతుల మంట అధికమైందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. జీఎస్టీ బిల్లు అనంతరం రైతుల సమస్యలపై చర్చించాలన్నారు. రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/