అంకెల మాయ‌గా య‌న‌మ‌ల వారి బ‌డ్జెట్

Update: 2017-03-15 07:28 GMT
మ‌రో అంకెల గార‌డీతో బ‌డ్జెట్ లెక్క‌ల్ని అప్ప‌జెప్పేశారు ఏపీ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. ప‌వ‌ర్లోకి వ‌స్తే చాలు అన్ని మీ ముంగిట్లోకి తీసుకొచ్చేస్తామంటూ చెప్పిన బాబు స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చినా.. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిందేమిటో తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసు. బాబు వ‌స్తే జాబు గ్యారెంటీ అని.. నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీల్లో అస‌లు ప‌స ఏమిట‌న్న‌ది చూస్తున్న‌దే. ప్ర‌తి ఏటా బ‌డ్జెట్ పేరుతో రాసుకొచ్చిన కాసిన్ని అంకెల్ని వ‌రుస‌గా చెప్పేసి.. మ‌మ అని ముగించే కార్య‌క్ర‌మాన్ని మ‌రోసారి పూర్తి చేశారు య‌న‌మ‌ల‌.
ఆర్థిక మంత్రిగా గ‌తంలోనూ వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌కు.. అదే ప‌నిగా చెప్పిందే చెప్ప‌టం బోర్ కొట్టిందేమో కానీ.. బ‌డ్జెట్ చ‌ద‌వ‌టంలో ఆయ‌న గొంతు నిస్సారంగా ధ్వ‌నించింది. విప‌క్షాల పై విరుచుకుప‌డేట‌ప్పుడు ఆయ‌న మాట‌ల్లో ధ్వ‌నించే ఉత్సాహం బ‌డ్జెట్ చ‌దువుతున్న‌ప్పుడు మాత్రం క‌నిపించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.  మొత్తం బ‌డ్జెట్ 1,56,999 కోట్లుగా చెప్పిన య‌న‌మ‌ల‌.. ఆదాయానికి వ‌స్తే.. కేంద్రం మీద ఆధార‌ప‌డిన వైనం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు అనుగుణంగా వండి వార్చినట్లుగా స్పష్ట‌మ‌వుతుంది.

ఇక‌.. 2017-18 ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ అంచ‌నాల్ని ఒక్క‌సారి చూస్తే..

= మొత్తం బడ్జెట్‌                రూ. 1,56,999 కోట్లు

= రెవిన్యూ వ్యయం             రూ. 1,25,911 కోట్లు

= పెట్టుబడి వ్యయం             రూ. 31,087 కోట్లు

పన్నుల ఆదాయం               రూ.82,855 కోట్లు

బడ్జెట్‌లో రాష్ట్ర పన్నుల వాటా    రూ.53,717 కోట్లు

సేల్స్‌ ట్యాక్స్‌ ఆదాయం          రూ.39,321 కోట్లు

కేంద్ర పన్నుల వాటా             రూ.29,138 కోట్లు

కేంద్రం ఇచ్చే నిధుల              రూ.37,548 కోట్లు

పన్నేతర ఆదాయం               రూ.5,092 కోట్లు

ఎక్సైజ్‌ ఆదాయం                  రూ. 5,886 కోట్లు

విద్యారంగానికి                     రూ.20,384 కోట్లు

గ్రామీణాభివృద్ధికి                   రూ.19,565 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమానికి              రూ.17,073 కోట్లు

సాగునీటి రంగానికి                 రూ.12,770 కోట్లు

సంక్షేమ రంగానికి                   రూ.11,361 కోట్లు

వ్యవసాయ రంగానికి                రూ.9,090 కోట్లు

ఆరోగ్యశాఖకు                        రూ.7,020 కోట్లు

పట్టణాభివృద్ధి శాఖకు                రూ.5,207 కోట్లు

హోంశాఖకు                           రూ. 5,221 కోట్లు

పర్యావరణ శాఖకు                   రూ. 4,813 కోట్లు

జనరల్ ఎకో సర్వీసెస్‌కు              రూ 4,813 కోట్లు

పింఛన్లకు                             రూ. 4,376 కోట్లు

విద్యుత్ రంగానికి                     రూ. 4,274 కోట్లు

రహదారులు, భవనాల శాఖకు       రూ.4041 కోట్లు

రవాణా శాఖకు                        రూ.3,946 కోట్లు

రుణమాఫీకి                            రూ. 3,600 కోట్లు

ఎస్టీ సబ్‌ప్లాన్‌కు                        రూ.3,528 కోట్లు

నిరుపేదల విద్యుత్‌ సబ్సిడీకి            రూ. 3,300 కోట్లు

పౌరసరఫరాల శాఖకు                  రూ. 2,800 కోట్లు

పరిశ్రమలు, గనులకు                   రూ. 2,085 కోట్లు

డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద రూ.1,600 కోట్లు

నీటిపారుదల, పారిశుద్ధ్య రంగానికి రూ. 1,575 కోట్లు

షాదీఖానాలకు                            రూ. 1500 కోట్లు

 హౌసింగ్‌ శాఖకు                         రూ. 1,456 కోట్లు

పశుగణాభివృద్ధికి                         రూ. 1,112 కోట్లు

రాజధాని అభివృద్ధికి                      రూ. 1,061 కోట్లు

క్రీడలు, యువజన శాఖకు               రూ.1,005 కో్ట్లు

కాపు కార్పొరేషన్‌కు                      రూ. 1000 కోట్లు

ఆరోగ్య శ్రీకి                                రూ 1000 కోట్లు

సాంకేతిక విద్యకు                         రూ. 765 కోట్లు

వరద నివారణకు                          రూ. 700 కోట్లు

నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కోసం రూ. 500 కోట్లు.

విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి   రూ. 450 కోట్లు

ఐటీ శాఖకు                                రూ. 364 కోట్లు

ఎల్‌పీజీ కనెక్షన్లకు                         రూ. 350 కోట్లు

మత్స్యశాఖకు                              రూ. 282 కోట్లు

గ్రామీణ రహదారులకు                     రూ. 262 కోట్లు

అన్నా క్యాంటీన్లకు                          రూ. 200 కోట్లు

మరుగుదొడ్ల నిర్మాణానికి                   రూ. 100 కోట్లు

ఎన్టీఆర్‌ సుజల స్రవంతికి                   రూ. 100 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవకు                        రూ. 100 కోట్లు

వికలాంగుల సంక్షేమానికి                  రూ. 90 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు                     రూ.75 కోట్లు

సాంస్కృతిక శాఖకు                        రూ. 78 కోట్లు

క్రైస్తవ కార్పొరేషన్‌కు                        రూ.35 కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News