గత చంద్రబాబు పాలనలో వైసీపీ ప్రభుత్వానికి తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా చంద్రబాబు - లోకేష్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
టీడీపీ సర్కార్ హయాంలో ముఖ్యంగా నారాలోకేష్ ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్ తోపాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుక - రంజాన్ తోఫా - క్రిస్మస్ కానుక పథకాల్లో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం.
చంద్రబాబు హయాంలోని అక్రమాలు అవినీతిపై జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఈ అవినీతి సాగినట్టు సబ్ కమిటీ తేల్చింది.
ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ - చోరీ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడికి చెందిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ కు గత చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టినట్టు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతోపాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది.
*ఇదీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారం
ఏపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్ ఎఫ్ ఎల్ (ఆంధ్రపదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. హారిజోన్ బ్రాడ్ క్రాస్ట్ ఎల్ ఎల్ పీ - సిగ్నమ్ డిజిటల్ నెట్ తో టెరాసాఫ్ట్ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్ దాఖలు చేసింది.
అయితే ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్ ను 2015 మే 11న ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల చోరీ కేసులో నిందితుడు - చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ బిడ్ ను ఆమోదించాలని టీడీపీ సర్కార్ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని సబ్ కమిటీ నివేదించింది. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్–1ను కాదని అధిక ధరక బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పినట్టు కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. ఈ క్రమంలో పైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్ కు నివేదిక ఇచ్చింది.
*చంద్రన్న కానుకలోనూ అవినీతి వరద..?
చంద్రన్న కానుక - రంజాన్ తోఫా పేరిట గత సర్కారు పేదలకు పంపిణీ చేసిన రేషన్ సరుకుల్లోనూ పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు నిర్థారణ అయింది. చంద్రన్న కానుక కింద సంక్రాంతి పండుగకు పేదలకు అందించిన గిఫ్ట్ ప్యాక్ లో మిగిలిన సరుకులతో పాటు 100 గ్రాముల చొప్పున నెయ్యి కూడా పంపిణీ చేశారు. బహిరంగ మార్కెట్లో కేవలం 320-375 మధ్య తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను కాదని హెరిటేజ్ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ. 499తోపాటు దీనిమీద 14.5 శాతం విలువ ఆధారిత పన్ను కలిపి కిలో రూ.575 చొప్పున గత సర్కారు కొనుగోలు చేసింది. ఒక ఏడాది నెయ్యి సరఫరాలోనే రూ.26 కోట్లకు పైగా దుర్వినియోగం అయిందనే ఆరోపణలున్నాయి.
సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు సరుకులన్నీ ఒక సంచిలో పెట్టి ఇచ్చేందుకు గిఫ్ట్ సంచుల పేరిట ఏటా అదనంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసి నాసిరకం సంచులిచ్చారు. చంద్రన్న కానుక సరుకుల సరఫరా టెండర్లను సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకున్నారని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది.
మొత్తంగా 2015-19 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ధరల్లో వ్యత్యాసం - నాసిరకం సరుకులు సరఫరా చేయడం ద్వారా రూ.158.38 కోట్ల మేర ఇందులో అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది.
ఈ రెండు స్కాంలలో ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ తోపాటు.. చంద్రన్నకానుకల్లో అవినీతిలో నాటి సీఎం చంద్రబాబు అవినీతి ఉందని కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులు చంద్రబాబు - లోకేష్ లు బుక్కైనట్టేనని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే వీరి అరెస్ట్ తప్పదా అన్న చర్చ కూడా మొదలైంది. మరి ఎక్కడా దొరకని చంద్రబాబు ఈసారి సీఎం వైఎస్ జగన్ కు దొరికాడా అన్న న్యూస్ వైరల్ అవుతోంది.