ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ వేళ జనాలు కనీస నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగడంపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. నిత్యవసరాల కోసం ఏపీలో జనం భారీగా ఎగబడడంపై కఠిన చర్యలకు సిద్ధమైంది.
ప్రస్తుతం లాక్ డౌన్ వేళ ఏడు గంటల పాటు నిబంధనలు సడలించి జనాలను బయటకు అనుమతిస్తున్నారు. కానీ జనం దూరం పాటించకుండా కొనుగోళ్లకు గుంపులుగా ఎగబడుతున్నారు. దీని వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండడంతో ఏపీ సర్కారు అలెర్ట్ అయ్యింది.
ఏపీలోనూ కరోనా మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రాణాంతక వైరస్ నివారణలో ప్రజల సహకారం ఉండడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఉదయం నిత్యావసరాల కోసం 7 గంటలు సమయం ఇచ్చినా జనం సామాజిక దూరం పాటించకుండా ఎగబడుతుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో రేపటి నుంచి కేవలం 4 గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం జనాన్ని అనుమతించాలని డిసైడ్ అయ్యింది.
ఏపీలో లాక్ డౌన్ వేళ ఇక రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి అనుమతించాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న పరిమితిని ఇప్పుడు కుదించారు. ప్రజలు గుంపులుగా వెళుతున్న ఈ సమయంలో ఇలా కఠిన చర్యలు తీసుకోకపోతే కరోనా మరింత వ్యాపించడం ఖాయమని ఇలా నిబంధనలు కఠినతరం చేసింది.