ప్రజాస్వామ్య ఆకాంక్షలను వ్యక్తీకరించే హక్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా అణిచేవేస్తోందని ఇప్పటికే ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న తీరుకు మరింత బలం చేకూర్చే సంఘటనలు తాజాగా జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఉద్యమాలను అణిచివేస్తున్న దానికి తోడుగా తాజాగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే గళంపై సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని కాపు వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా కాపు నేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కాపులకు బీసీ కోటా హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ఈనెల 26 నుంచి ముద్రగడ పద్మనాభం పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని అడ్డుకునేందుకు పోలీసులు అన్నిరకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారని కాపు వర్గాలు అంటున్నాయి.
తాజా నోటీసుల పర్వంలో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీ మినహా విపక్ష నాయకులకు పోలీసులు 149 సిఆర్ పిసి కింద నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో సెక్షన్ 30 - సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని, అందువల్ల సమావేశాలు - సభలు - పాదయాత్రలు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రెండు రోజుల నుంచి వైసీపీ - సీపీఎం - సీపీఐ నేతలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. బుధవారం వైసీపీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ రాజమహేంద్రవరం రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఇంటికి పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఆయన హైదరాబాద్ లో ఉండటంతో వెనుదిరిగారు. రాజమహేంద్రవరంలోని సీపీఎం కార్యాలయానికి వెళ్లిన పోలీసులు పార్టీ జిల్లా కార్యదర్శి టి.అరుణ్ కు నోటీసులు ఇచ్చారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, ఈ పాదయాత్రలో పాల్గొనడం చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. అనుమతులు లేని పాదయాత్రల్లో పాల్గొంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ప్రకాష్ నగర్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పేరుతో ఈ నోటీసు ఇచ్చారు. సీపీఐ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. రైతు సమస్యలపై ధర్నాలకు సంబంధించి సమావేశంలో ఉన్నామని, తర్వాత రావాల్సిందిగా చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. రాజమహేంద్రవరంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా వైసిపి - సిపిఐ - సిపిఎం నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఇదిలాఉండగా ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇవ్వడంపై రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారిని మీడియాతో స్పందిస్తూ ముద్రగడ పాదయాత్రకు మద్దతు తెలిపిన నేతలకు నోటీసులు ఇస్తున్నాం తప్ప అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదని తెలిపారు.