ఏపీ సీఎం చంద్రబాబు మరో బలమైన ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం చేసిన కాపు ఉద్యమాలతో ఇబ్బందులు పాలైన చంద్రబాబుకు ఇప్పుడు మరో ఉద్యమ సెగ తగలనుంది. తాజా ఉద్యమం జర్నలిస్టు సమాజం నుంచి పురుడు పోసుకుంటోంది. చంద్రబాబు తమను నిర్లక్యం చేస్తుండడం, సమస్యలను పరిష్కరించకపోవడంతో జర్నలిస్టులు ఉద్యమాలకు రెడీ అవుతున్నారు.
ఏపీ బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏమీ కేటాయించలేదు.. ఇదే సమయంలో తెలంగాణలో జర్నలిస్టుల కోసం రూ.30 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేశారు. దీంతో రూ.50 కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని కోరుతూ ఐ.జె.యు., ఎ.పి.యు.డబ్ల్యు.జెలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఇందుకు ఏప్రిల్ 9వ తేదీకి ముహూర్తం పెట్టాయి. ఆ రోజు నుంచి పోరాటం మొదలవనుంది. విజయవాడ కేంద్రంగా ఆ రోజు 5000 మంది జర్నలిస్టులతో ప్రత్యేక సదస్సును నిర్వహించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా మండల -డివిజన్ - నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించి, ఉద్యమానికి సన్నద్దం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
రాష్ర్టప్రభుత్వం 1,56,999 కోట్లరూపాయలతో బడ్జెట్ రూపొందించినా అందులో ఒక్క రూపాయి కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం కేటాయించకపోవడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. అర్ధరాత్రిళ్ల వరకు సమావేశాలు పెట్టి.. ప్రెస్ మీట్లు పెట్టే చంద్రబాబు వార్తలు సరిగా కవర్ కాకుంటే జర్నలిస్టులపై విరుచుకుపడుతుంటారని.. ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం కూడా పట్టించుకోరని సీనియర్ జర్నలిస్టులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/