కరోనా టైంలోనూ ఆ మంత్రి గారు అన్ని పిండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ కొత్త దందా దోపిడీ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోందన్న ప్రచారం బెజవాడలో విస్తృతంగా సాగుతోంది.
కృష్ణ జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులే ఇందులో సూత్రధారులుగా ప్రచారం సాగుతోంది. ఈ మంత్రి అనుచరుడు ఒకరు ఫార్మా రంగంలో ఉన్నాడట.. దీంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు - మందుల డిస్ట్రిబ్యూటర్లను సమావేశపరిచి కరోనా కాలంలో బాగా అమ్ముడు పోతున్న మందుల వివరాలు తెలుసుకున్నాడట.. వాటిని తానే సరఫరా చేస్తానని.. వాటిని విక్రయించాలని హుకూం జారీ చేశారు.మాట వినకుండా ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు.
పీసీడీ మందుల ద్వారా నెలకు రూ.50 కోట్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఆ మందుల నాణ్యత ఏమిటీ అన్న విషయాన్ని అధికారులు పట్టించుకోకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక కరోనా వేళ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో మంత్రి అనుచరుడి వద్దకు వెళితే క్షణంలో బెడ్ దొరుకుతోందట.. అలా బెడ్ ఇప్పించినందుకు ఏకంగా రూ.50వేలు వసూలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంత్రిగారి కోటా కింద కొన్ని బెడ్ లు పక్కన పెట్టాలని ఆస్పత్రులకు హుకూం జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
ఇక కరోనా పరీక్షలకు డబ్బులు పిండుకుంటున్నాడని.. ఒక్కో టోకెన్ ను రూ.200 వరకు వసూలు చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతుతన్నాయి.
మెడికల్ టెండర్లలోనూ మంత్రి బినామీలదే రాజ్యమన్న ప్రచారం సాగుతోంది. మంత్రి బినామీ కంపెనీకే మెడికల్ సర్వీస్ టెండర్ దక్కిందట.. ఇలా సర్వం కరోనా వేళ అన్నింటిని మంత్రి గారు దగ్గరుండి చూసుకుంటున్నట్టు బెజవాడలో కోడై కూస్తున్నారు.