ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్య దర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన స్థానంలో 1981వ బ్యాచ్ కు చెందిన ఎస్పీ టక్కర్ ను నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబును విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్ళిన టక్కర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్న విషయాన్ని చంద్రబాబు చెప్పారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పదవీ విరమణ చేయనున్న ఐవైఆర్ కృష్ణారావు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందా? లేదా? అన్నది త్వరలో తేలనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి టక్కర్ తోపాటు అడవులు - పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఏకే ఫరిడా - గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే రమేష్‌కుమార్ పదవీ కాలం మరో రెండు మాసాలే ఉండడంతో ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
వాస్తవానికి ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్త రంజన్ భిశ్వాల్ (సీఆర్ భిశ్వాల్)ను ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు తుది ఆమోదం కోసం గవర్నర్ నరసింహన్ కు పంపారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిని చేపట్టినవారు మరే పదవులు నిర్వహించరాదన్న నిబంధన ఉండడంతో ప్రభుత్వం పంపించిన ఫైలును గవర్నర్ కార్యాలయం తిరిగి వెనక్కి పంపించింది. ఈ విషయంలో చంద్ర బాబు గవర్నర్ నరసింహన్ ను స్వయంగా కలిసి వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఎన్నికల సంఘానికి తాను ప్రతిపాదించిన భిశ్వాల్ ను కాకుండా మరొకరిని నియమించాలని భావించారు. కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ రమేష్ ను ఈ పదవికి ఎంపిక చేయాలన్న పలువురు మంత్రుల ప్రతిపాదనలపై చర్చించిన చంద్ర బాబు చివరికి ఆయననే ఈ పదవిలో నియమించాలన్న అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈనెల 25న విజయవాడలో జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఐవైఆర్ స్థానంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ను నియమిస్తున్న విషయాన్ని సీఎం ప్రకటించే అవకాశ మున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రిమండలి సమావేశానికి రావాలని ఇప్పటికే సీఎం కార్యాలయం టక్కర్‌కు ఆహ్వానం పంపినట్టు సమాచారం. సెప్టెంబర్ 31న కొత్తగా నియమితులవుతున్న సీఎస్ ఎస్పీ టక్కర్ పదవీ విరమణ చేయనున్నారు. కొత్త సీఎస్ బాధ్యతలు చేపట్టినా ఈ పదవిలో కొనసాగేది కేవలం ఎనిమిది మాసాలేనని, ఆ తర్వాత మరో సీఎస్ ను ఎంపిక చేయవలసి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.