పాలనలో జగన్ మార్క్.. భారీ కుదుపు

Update: 2020-05-10 11:26 GMT
పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నారు.. ఆదివారం సెలవు రోజైనా సరే ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచేలా తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాలనను వేగవంతం చేసే చర్యలు చేపట్టారు.

ఏపీ వ్యాప్తంగా ఆదివారం జగన్ సర్కార్ ప్రక్షాళన చేసింది. ఏకంగా 27 మంది జూనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా అధికార యంత్రాగాన్ని మరింత బలోపేతం చేసేలా.. పరిపాలనను కట్టుదిట్టం చేయడంలో భాగంగా జిల్లాలకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లను నియమించడానికి ఈ బదిలీలు చేపట్టారు.

రైతు భరోసా - రెవెన్యూ - గ్రామ/వార్డు సచివాలయాలు, గ్రామ/వార్డు వలంటీర్ల వ్యవస్థను పటిస్టం చేయాలని జగన్ ఈ మేరకు మార్పులు చేర్పులు చేశారు. ఇక జాయింట్ కలెక్టర్లకు పని విభజనను కూడా నిర్ధేశించారు. జాయింట్ కలెక్టర్1కు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ బాధ్యతలిచ్చారు. జేసీ2లకు వైద్య - ఆరోగ్య విభాగాలను చేర్చారు.

ఇక పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా దీనికోసం ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించారు. పోలవరం ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్న ఓ ఆనంద్ ను అదే పోస్టులో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. ఇలా జగన్ ఈ బదిలీలతో తన మార్క్ చూపించడంతోపాటు ప్రాధాన్యాలకు పెద్దపీట వేశారు.
   
ఈ సంద‌ర్భంగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. 13 జిల్లాలకు అదనపు జేసీల నియామకం కోసం ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది. కొత్తగా ఏర్పాటుచేసిన జేసీ-రెవెన్యూ - జేసీ-సంక్షేమం - జేసీ-అభివృద్ధి పోస్టులకు ఐఏఎస్‌లను నియమిస్తూ ఆదివారం ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ప్రభుత్వ పథకాలను పేద‌ల‌కు అందించేందుకు.. సమర్థవంతంగా అమలుచేసేందుకు 13 మంది జాయింట్ కలెక్టర్లను నియమించారు.

ఈ సంద‌ర్భంగా బ‌దిలీలు ఈ విధంగా ఉన్నాయి..

షన్‌ మోహన్                         ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌
సుమిత్‌ కుమార్                     శ్రీకాకుళం జేసీ(రెవెన్యూ)
కె. శ్రీనివాసులు                      శ్రీకాకుళం జేసీ(అభివృద్ధి)
కిశోర్‌ కుమార్                        విజయనగరం జేసీ (రెవెన్యూ)
మహేశ్‌ కుమార్                      విజయనగరం జేసీ (అభివృద్ధి)
వేణుగోపాల్‌ రెడ్డి                      విశాఖపట్నం జేసీ(రెవెన్యూ)
అరుణ్‌ బాబు                         విశాఖపట్నం జేసీ (అభివృద్ధి)
లక్ష్మీషా                               తూర్పుగోదావరి జిల్లా జేసీ (రెవెన్యూ)
కీర్తి                                    తూర్పుగోదావరి జిల్లా జేసీ (అభివృద్ధి)
వెంకటరామిరెడ్డి                       పశ్చిమ గోదావరి జేసీ (రెవెన్యూ)
హిమాన్షు శుక్లా                       పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి)
మాధవిలత                            కృష్ణా జేసీ (రెవెన్యూ)
శంకర్‌ లతోటి                          కృష్ణా జేసీ (అభివృద్ధి)
దినేశ్‌కుమార్                          గుంటూరు జేసీ (రెవెన్యూ)
ప్రశాంతి                                గుంటూరు జేసీ (అభివృద్ధి)


Tags:    

Similar News