ఓవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ‘బాహుబలి’ గురించి ఎంత పెద్ద చర్చ నడిచిందో తెలిసిందే. 2019 ఎన్నికల్లోపు తమకోసం ఒక బాహుబలి వస్తాడంటూ జానా రెడ్డి చేసిన కామెంట్ ను ఆ పార్టీ నాయకులు రకరకాలుగా అన్వయించుకున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ బాహుబలి ప్రస్తావన వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఏపీ రాజకీయాల్లో బాహుబలి గురించి ప్రస్తావించాడు. ఇక్కడ బాహుబలి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే అన్నాడు అనిల్. ఐతే అనిల్ ఈ ప్రస్తావన ఊరికే తేలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ తో జగన్ కు పోలిక పెడుతూ.. అనిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
వైఎస్ జగన్.. నారా లోకేష్ మధ్య పోలిక కేవలం ఇద్దరూ ముఖ్యమంత్రుల కొడుకులు అనే విషయంలో మాత్రమే అని.. అది మినహాయిస్తే ఇద్దరికీ అసలు ఎక్కడా పోలికే లేదని అనిల్ కుమార్ అన్నాడు. రాజకీయ పరిణతి విషయంలో జగన్ ముందు లోకేష్ ఎంతమాత్రం నిలవలేడని చెప్పాడు. జగన్ బాహుబలి లాంటి హీరో అయితే.. లోకేష్ బ్రహ్మానందం లాంటి కమెడియన్ అని అభివర్ణించాడు అనిల్. బాహుబలి లాగే జగన్ కూడా విజయం సాధిస్తాడని అన్నాడు. జగన్ ను తర్వాతి ఎన్నికల్లో సీఎంగా చూడటానికి తన లాంటి యువ సైన్యం అండగా నిలవాలని అనిల్ పిలుపునిచ్చాడు. గత ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల జగన్ కు.. పార్టీకి మంచే జరిగిందని.. దీని ద్వారా తాము ప్రజల సమస్యలపై మరింత అవగాహన పెంచుకుని.. వాటిని పరిష్కరించడం ఎలాగో బాగా తెలుసుకున్నామని అన్నాడు. రాబోయే ఎన్నికల్లో జగన్ తప్పక గెలిచి సీఎం అవుతాడని.. వైఎస్ ఆశీర్వాదం తమకు తప్పక ఉంటుందని అనిల్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/