ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురవుతున్న ఇసుక కొరత సమస్య నేపథ్యంలో....భవన నిర్మాణ కూలీలకు అండగా సాగరతీరంలో వేలాది మందితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. లాంగ్ మార్చ్ కు పోలీసుల అనుమతి కూడా పొందారు. మరోవైపు ఈ మార్చ్ పై అధికార వైసీపీ విరుచుకుపడుతోంది. మంత్రుల నుంచి మొదలుకొని...ఎమ్మెల్యేల వరకు పవన్ తీరును తప్పుపడుతూ...ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాష్ర్ట జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ...టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన మారిందన్నారు. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఇసుక దందా జరిగిందని ఆరోపించారు. 100 కోట్లు ఫైన్ వేశారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ``ఐదేళ్ల కరవుని తీరుస్తూ వర్షాలు, వందల టీఎంసీ నీళ్లు ప్రవాహం అవుతున్నాయి. -55 రోజులుగా కృష్ణా బ్యారేజ్ గేట్లు తెరిచి ఉన్నాయి. వరదల్లో ఇసుక తీసే అవకాశం ఉండదనే కనీస సృహ ఉండాలి. కానీ అది లేకుండా పవన్ కల్యాణ్ చేస్తున్నది లాంగ్ మార్చా.. రాంగ్ మార్చా? ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో చంద్రబాబు - దత్త పుత్రుడు పవన్ చేస్తున్న ఆర్భాటం ఇది. ఏ ప్రభుత్వమైనా ఇసుకను దాచుకుంటుందా? ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్ ఇసుకను ఎందుకు దాచుకుంటారు? లాంగ్ మార్చ్ కు జనసేన కంటే టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా వెళ్తున్నారు``అని మండిపడ్డారు.
వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...సంచలన వ్యాఖ్యలు చేశారు. `పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించేప్పుడు అనేక బ్యానర్లు - ప్రోడక్షన్ లలో పనిచేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఒకటే బ్యానర్ ను ఎంచుకున్నారు. అదే నారా వారి ప్రోడక్షన్. ఆ బ్యానర్ లోనే ఆయన ప్యాకేజీలు నడుస్తున్నాయి. పవన్ సినిమాలు ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన కాల్ షీట్ ల కోసం పెద్దపెద్ద ప్రోడ్యూసర్లు తిరుగుతున్నారు. అయినా సినిమాలను వదులుకున్నారంటే.. చంద్రబాబు ఇచ్చే కాల్షీట్లు - రెమ్యునరేషన్ ఎక్కువ కాబట్టే అని అర్ధం అవుతోంది. పవర్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారిపోయారు` అని ఎద్దేవా చేశారు. ``ఈ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయితే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని బహిరంగంగా చెప్పారు. వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి సీఎం అవ్వడం కల అని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కొత్త పేరు ఎప్పుడు చెబుతారు.? రెండు లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తిగా... తన పుస్తకాల్లోని మంచి పేరును ఆయన ఎప్పుడు పెట్టుకుంటారు.? మీ పేరు నారా పవన్ కళ్యాణ్ అని మార్చుకుంటారా?`` అని అమర్‌నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు.