జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఇప్పుడు చిత్రవిచిత్రమైన రీతిలో విమర్శలు క్యూ కడుతున్నాయి. గడిచిన నాలుగురోజులుగా ఆయన చేస్తున్న ఏపీ పర్యటన సందర్భంగా చేస్తున్నవ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను అభిమానించే సిని హీరో ఇంత చవట అని తాను అనుకోలేదన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టిన ఆయన.. ప్రజారాజ్యం నుంచి బరిలోకి దిగిన చిరంజీవి ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన్ను మోసం చేసిన తొలి వ్యక్తి తమ్ముడు పవన్ కల్యాణేనని విమర్శించారు.
బాబుకు ఏ కష్టం వచ్చినా హడావుడి చేసే పవన్ సొంత అన్న చిరంజీవిని మాత్రం మోసం చేశారన్నారు. బాబుకు మద్దతు ఇస్తున్న పవన్.. పార్టీ ఫిరాయింపులపై ఎందుకు ప్రశ్నించటం లేదంటూ క్వశ్చన్ చేశారు. తానుచదువుకునే రోజుల్లో పవన్‌ను అభిమానించేవాడినని.. అయితే ఈ రోజు ఆయన తీరు ఇలా ఉంటుందని తాను అనుకోలేదన్నారు. ఒకప్పుడు తాను సినిమాల్లో అభిమానించిన వ్యక్తి మరీ ఇంత చవటని తాను బాధపడుతున్నట్లు చెప్పారు.
తాను అభిమానించిన హీరో ఒక వ్యక్తి వెనుక దాక్కుంటాడా? ఇంత అధైర్యస్తుడా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తెచ్చే స్థాయి తనకు లేదని.. తానో చిన్నవ్యక్తినని చెప్పే పవన్.. ఏం నాయకుడు? మరి దేని గురించి ప్రశ్నిస్తారంటూ అనిల్ మండిపడ్డారు.
రాజ్యాంగం.. విలువలు అంటూ పవన్ మాట్లాడతారని.. మరి బాబును వెనకేసుకు వచ్చే పవన్.. తమ పార్టీ ఎమ్మెల్యేల్ని బాబు కొనేస్తుంటే అది నైతిక విలువ అవుతుందా? అంటూ ఫైర్ అయ్యారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించిన అనిల్.. తనకు ప్రత్యేక హోదా తెచ్చే స్థాయి లేదని.. తానో చిన్న వ్యక్తినని అంటున్న పవన్ ఏం నాయకుడు? అంటూ మండిపడ్డారు.
ప్రజల కోసం పని చేస్తునన జగన్ ను ప్రశ్నిస్తున్నారని.. ప్రజల కోసం పని చేస్తున్న జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోకూడదా? అన్న అనిల్.. పవన్ కల్యాణ్ మాటల్లోని వైరుధ్యాన్ని ఎత్తి చూపించారు. తన గురించి ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోనని అంటారని.. కానీ ఆయన మాత్రం ఊళ్లో వాళ్లందరి గురించి మాట్లాడతారన్నారు. అలా మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఏపీలో అవినీతి పెరిగిపోతుందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. వాటి గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే అనిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.