జిల్లా స్థాయిలో జిల్లా సమీక్ష అయినా - నగర పాలక సమీక్ష అయినా - పురపాలక సమీక్ష అయినా... ఎమ్మెల్యేలు - ఎంపీలు - ఎమ్మెల్సీలకు ముందు వరుసలోనూ కుర్చీలు వేయాలి. ఇది ప్రొటోకాల్ చెబుతున్న నిబంధన. మరి ఓ పురపాలక సంస్థ సమావేశానికి వచ్చిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముందు వరుసలో కాకుండా వెనుక వరుసలో (రెండో వరుస)లో కుర్చీలేసి కూర్చోబెడితే.. రచ్చరచ్చే కదా. స్థలం లేని కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు చెబితే.. రెండో వరుసకు వెళ్లిన ఆ ప్రజాప్రతినిధులు ఊరుకున్నా... వారి అనుచరవర్గం ఊరుకోదు కదా. ఇక్కడా అదే జరిగింది. తమ ఎమ్మెల్యేలకు ముందు వరుసలో కాకుండా వెనుక వరుసలో సీట్లెలా వేస్తారంటూ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులు అధికారులపై చిందులు తొక్కారు. ఇది తమ ఎమ్మెల్యేలను అవమానించడమేనంటూ అనుచరులు చేసిన రచ్చ ఓ రేంజిలో జరిగిందట.
సరే... ఆ ఘటన వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో శుక్రవారం సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. వేదిక ముందు వరుసలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - కలెక్టర్ వీరపాండియన్ - జాయింట్ కలెక్టర్ రవి - ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి - ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి - కాటసాని రాంభూపాల్ రెడ్డి - శిల్పా చక్రపాణిరెడ్డి - తొగూరు ఆర్థర్ కూర్చున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలను ముందు వరుసలోనే కూర్చోబెట్టాలి. అయితే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి - ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వెనుక వరుసలో కూర్చోబెట్టారు.
వెనుక వరుసలోకి వెళ్లిపోయిన శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి - బిజేంద్రా రెడ్డిలు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు. వీరు కూర్చున్న రెండో వరుసలోనే అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు పీపీ నాగిరెడ్డి (నంద్యాల) - దేశం సుధాకర్ రెడ్డి (నంద్యాల) - శిల్పా భువనేశ్వర్ రెడ్డి (శ్రీశైలం) - యర్రబోతుల వెంకటరెడ్డి (బనగానపల్లె)లతోపాటు కొందరు జిల్లా స్థాయి అధికారులు కూర్చున్నారు. ఈదృశ్యాన్ని చూసినంతనే శిల్పా - గంగుల అనుచరులు అధికారులపై విరుచుకుపడ్డారు. వెనుక వరుసలో కూర్చున్న తమ ఎమ్మెల్యేలు నిలబడి మాట్లాడాల్సి వచ్చిందని వారు రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులపై మండిపడ్డారు. అయితే స్టేజీ పైన స్థలం లేకపోవడంతోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు వెనుక కుర్చీలు వేయాల్సి వచ్చిందని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇంకోసారి ఇలా జరగకుండా చెప్పడంతో ఎమ్మెల్యేల అనుచరులు సైలెంట్ అయ్యారట.