మండలిలో గడ్డం పై రచ్చ...బాబు - చైర్మన్ షరీఫ్ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రుల గడ్డాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము గడ్డాలు పెంచితే రౌడీలు అంటున్నారని, గడ్డం పెంచితే ఎవరైనా రౌడీలేనా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
ఆలా అయితే శాసనమండలి ఛైర్మన్ కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందని వాళ్లు కూడా రౌడీలేనా అని కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుండా పురాణాలను పరిశీలిస్తే మునులు, రుషులు గడ్డాలు పెంచారని, వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను అనగదొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపించారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్.. అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని తెలిపాడు.