ఆనంకు అనిల్ దిమ్మ తిరిగే ఆన్స‌ర్ ఇచ్చారుగా!

Update: 2017-05-04 08:25 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోరు పారేసుకుంటున్న టీడీపీ నేత‌ - మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద‌రెడ్డి... నిన్న కాస్తంత డోసు పెంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆనం వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అయితే ఆనంకు స‌రైన రీతిలో స‌మాధానం చెప్పేందుకు ఆనం సొంత జిల్లా నెల్లూరుకు చెందిన వైసీపీ యువ‌నేత‌, ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చారు.

మీడియా ముందుకు వ‌చ్చీ రాగానే ప‌క‌డ్బందీగా ఆనంపై అస్త్రాలు ఎక్కుపెట్టిన అనిల్‌... ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు. రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అని చెప్పుకుంటున్న ఆనం త‌న నోటినే కాకుండా భాష‌ను కూడా అదుపులో పెట్టుకోవాల‌ని అనిల్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయినా ఓ రాజ‌కీయ నేత‌గా ఆనం వ్య‌వ‌హ‌రించ‌డం లేదని తేల్చేసిన అనిల్‌... ఆనం యాక్ట‌ర్‌ గా అయితే బాగుండేద‌ని ఎద్దేవా చేశారు.

త‌న వికృత చేష్ట‌ల‌ను, న‌ట‌న‌ను అదుపులో పెట్టుకోక‌పోతే... ఆనంకు త‌గిన రీతిలో బుద్ధి చెప్పేందుకు త‌మ‌తో పాటు ప్ర‌జ‌లు కూడా సిద్ధంగానే ఉన్నార‌ని అనిత్ కాస్తంత భారీ స్థాయిలోనే వార్నింగిచ్చారు. ప‌ద‌వుల కోసం త‌మ నేత జ‌గ‌న్ ఆశ ప‌డే ర‌కం కాద‌ని చెప్పిన అనిల్‌... అవే ప‌ద‌వుల కోసం ఆనం బ్ర‌ద‌ర్స్ ఎంత‌కైనా దిగ‌జారే మ‌నుషులేన‌ని తేల్చి చెప్పారు. ఈ విష‌యం నిరూపించ‌డానికి ఏ ఒక్క‌రి వ‌ద్దో కార‌ణాలు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆనం బ్ర‌ద‌ర్స్ పొలిటిక‌ల్ జ‌ర్నీ చూస్తేనే జ‌నానికి ఇట్టే అర్థ‌మైపోతుంద‌ని కూడా అనిల్ తేల్చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News