ఆప్ పార్టీ మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే 2011లో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అని చెప్పాలి. నాడు అన్నా హజారే చేపట్టిన దీక్షలకు దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. ఆయన వెంట అంతా నడిచారు. అలా అరవింద్ కేజ్రీవాల్ అనే శిష్యుడు అన్నా హజారే నుంచి సామాజిక పాఠాలు నేర్చుకుని పెట్టిన పార్టీ ఆప్. ఆమ్ ఆద్మీ అన్నది దాని ఫుల్ ఫార్మ్. మరి ఆ పార్టీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించిందా అంటే లేదు అనే అంటున్నారు.
ఈ మాట అన్నది వేరే వారు అంటే రాజకీయ విమర్శగా చూడవచ్చు. సాక్ష్తాత్తు గురువు అన్నాహజారే ఈ మాటలు అంటున్నారు. ఆయన కేజ్రీవాల్ పార్టీని చూసి ఇది మన పార్టీ కాదు, ఉద్యమం ముంచి పుట్టిన ఆప్ కానే కాదు అనేశారు. మిగిలిన పార్టీలకు ఆప్ కి తేడా లేకుండా పోయిందని కూడా ఆయన విమర్శించారు. ఢిల్లీలోని ఆప్ సర్కార్ మద్యం పాలసీని కూడా ఆయన ఏకి పారేశారు.
నివాసాల మధ్య మద్యం దుకారణాలు ఏంటని నిలదీశారు. స్థానికుల మద్దతు లేకుండా నివాసాల మధ్య లిక్కర్ షాపులను పెట్టేది లేదని ఆప్ ఎన్నికల ప్రణాళిక స్వరాజ్ లో తనతో రాయించావని ఆయన గుర్తు చేశారు. ఇపుడు జరుగుతున్నదేంటి అని ప్రశ్నించారు. ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ తెరచుకుంటున్నాయని ఆయన విమర్శించారు.
అధికారం కోసం డబ్బు. అలాగే డబ్బు కోసం అధికారం ఇలా విష వలయంలో ఆప్ నేతలు చిక్కుకున్నారని విమర్శించారు. నాటి ఉద్యమం ఆనాటి ఆశయాలు ఏమయ్యాయని కూడా అన్నా హజారే కేజ్రీవాల్ ని నిగ్గదీశారు. అధికారం అనే మత్తులో పడి కేజ్రీవాల్ విషమెక్కారని కూడా ఘాటైన పదజాలం ఉపయోగించారు. మందుకు అధికారానికి తేడా లేదని, రెండూ మత్తునే ఇస్తాయని చెప్పారు.
బలమైన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలను తీసుకురావాలని నాడు సాగిన ఉద్యమం నాటి ఆశయాలు ఎక్కడికి పోయాయి అని కూడా క్రేజీవాల్ ని నిగ్గదీశారు. మొత్తానికి చాలా కాలంగా మౌనంగా ఉన్న అన్నా హజారే ఇపుడు బయటకు వచ్చి కేజ్రీవాల్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే బీజేపీ టార్గెట్ గా ఆప్ ఉంది. మనీష్ సిసోడియా మీద సీబీఐ కేసులు పడ్డాయి. అలా ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ గురువు కూడా శివాలెత్తిపోవడం అంటే కేజ్రీవాల్ కి భారీ షాక్ అనే చెప్పాలి.
ఒక విధంగా చూస్తే బీజేపీ ఆప్ ని వేధిస్తోంది అని అంతా అనుకుంటున్న వేళ ది కాదు కేజ్రీవాల్ లిక్కర్ పాలసీయే తప్పు అని అన్నా హజారే వంటి నీతి మంతుడు అనడం, పైగా ప్రజా, మహిళా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని విమర్శించడం అంటే కేజ్రీవాల్ కి బిగ్ ట్రబుల్స్ ని తెచ్చిపెట్టేదే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.