టార్గెట్ శరద్ పవార్ ..అన్నాహజారే దూకుడు

Update: 2017-01-04 08:05 GMT
అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే చాలాకాలంగా సైలెంటుగా ఉంటున్నారు. తాజాగా ఆయన మరోసారి భారీ కుంభకోణానికి సంబంధించిన డీటెయిల్సుతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు - కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మేనల్లుడైన అజిత్ పవార్ పై ఆయన ఈసారి గురిపెట్టారు. 25 వేల కోట్లను ఆయన మింగేశారని ఆరోపించారు.
    
అజిత్ పవార్ 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నా హజారే కేసులు వేశారు.  సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ బాంబే హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు  దాఖలు చేశారు. సహకార చక్కర ఫ్యాక్టరీలను అడ్డు పెట్టుకుని వీరిద్దరూ ఈ స్కామ్ లో పాలుపంచుకున్నారని మరో క్రిమినల్ పిల్ కూడా వేశారు. వీటిపై ఈ నెల 6 న విచారణ జరగాలని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.
    
మహారాష్ట్రలో సరిగా నడవని షుగర్ కో-ఆపరేటివ్ ఫ్యాక్టరీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని.. వాటిని కారు చౌకగా పవార్ కొట్టేస్తున్నారని...  ఇందులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందని... దీనివల్ల ప్రభుత్వానికి 25 వేల కోట్ల నష్టం వస్తోందని ఆయన ఆరోపించారు.  శరద్ పవార్ - అజిత్ పవార్ లను ప్రతివాదులుగా పేర్కొనడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News