సామాజిక ఉద్యమ నేత - గాంధేయవాది అన్నా హజారేకి కోపమొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అవినీతిని అంతమొందిస్తామంటూ ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ.. దుమ్మెత్తి పోశారు. ప్రధాని మోదీ కేంద్రంగా విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అన్నా వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. విషయంలో్కి వెళ్తే.. గాంధీ జయంతి సందర్భంగా అన్నా హజారే సోమవారం న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించారు. మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. అనంతరం ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. మహాత్మాగాంధీ కన్న కలలకు దేశం దూరంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఈరోజు అక్టోబర్ 2. గాంధీ జయంతి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా గాంధీజీ కలలు సాకారం చేయలేకపోయాం. గాంధీజీ ఆశయాలకు దూరంగా జరుగుతున్నాం. ఆ కారణంగానే గాంధీ సమాధి నుంచే సత్యాగ్రహం చేపట్టబోతున్నాను' అని తెలిపారు. లోక్ పాల్ బిల్లును అమలు చేయడంలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. మరో సత్యాగ్రహ ఆందోళన చేపడతానని హెచ్చరించారు. ప్రధాని మోదీ పనీతీరుపై సంతృప్తిగా లేననీ, అందుకే నిరాహార దీక్షకు దిగుతున్నానని చెప్పారు. దేశంలో అవినీతిని ప్రభుత్వం అదుపు చేయలోకపోతోందని తప్పుపట్టారు.
'ప్రజలు ఎన్నో ఆశలతో మీకు ఓటు వేసి అధికారం అప్పగించారు. పని చేయించుకోవాలంటే సామాన్యుడు డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తోంది. అవినీతి తగ్గుముఖం పట్టలేదు. ప్రతిరోజూ ప్రజలకు ఈ అనుభవం ఎదురవుతూనే ఉంది' అని అన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. 'లోక్ పాల్ - లోకాయుక్త చట్టం అమలు చేస్తే అవినీతి 50 నుంచి 60 శాతం తగ్గుతుంది. దానిపై మీరు ఇప్పటికీ చర్చలు తీసుకోలేదు. కనీసం పెదవి విప్పి మాట్లాడలేదు. ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. అవినీతి రహిత భారతం ఎలా సాధ్యమని అనుకుంటున్నారు' అని మోదీని నిలదీశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా అలజడి రేగింది. రెండు రోజుల కిందట సొంత పార్టీ బీజేపీ సీనియర్ నేత - మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన విషయం ప్రజలు మరిచిపోకముందే ఇప్పుడు అన్నా చెరిగిన నిప్పులతో మోదీ విలవిల లాడుతున్నారని, పైకి మాత్రం గంభీరంగా ఉన్నారని సమాచారం. మొత్తానికి ఈవిషయాలపై అంతర్మథనం స్టార్ట్ అయిందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.