హైద‌రాబాద్‌ లో అన్నాహ‌జారే...ఆహ్వానించింది ఎంపీ క‌విత‌

Update: 2019-01-19 08:51 GMT
టీఆర్ ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జాగృతి హైద‌రాబాద్ వేదిక‌గా కీల‌క స‌ద‌స్సు నిర్వ‌హిస్తోంది. అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీ నోవాటెల్ హోటల్‌ లో నేటి నుంచి నిర్వ‌హిస్తున్నారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి - నూతన ఆవిష్కరణల బావనతో సదస్సు నిర్వహణ. నేటి ప్రారంభ సమావేశానికి అన్నా హజారే - సార్క్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్ బహదూర్ థాపా ప్రత్యేక అతిథి లుగా హాజరయ్యారు. సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు - 40 మంది వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. నేడు సదస్సులో యువత అభివృద్ధిపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్టి చేపట్టారు. ప్యానలిస్టులుగా అసోం ఎంపీ గౌరవ్ గగోయ్ - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ - నిజామాబాద్ ఎంపీ కవిత వ్యవహరిస్తున్నారు.

హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును అన్నాహజారేతో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభించారు. ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి - ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. ఏడాది - ఐదేళ్లు - పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని చెప్పారు. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే మనల్ని దేవుడు ఇక్కడికి పంపారు. భగవంతుడు పుణ్యక్షేత్రాల్లోనే కాదు.. అన్ని చోట్లా ఉంటాడు అని అన్నా హజారే తెలిపారు.

ఎంపీ క‌విత మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకు మనం సృష్టించుకున్నవే అని ఎంపీ కవిత తెలిపారు. ప్రపంచంలో ఏటా 22 వేల మంది చిన్నారులు చనిపోతున్నారు. సుస్థిర అభివృద్ధికి ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరం ఉంది. మన వల్ల ఉద్భవించిన కొన్ని సమస్యలకైనా ఈ సదస్సులో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను. యువత కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి అని కవిత పేర్కొన్నారు.



Full View

Tags:    

Similar News