ప్రపంచాన్ని ఆవహించిన ఈ మాయదారి కరోనా వైరస్ మనల్ని అప్పుడే విడిచిపెట్టి పోయేలా కనిపించడం లేదు. రోజురోజుకు రూపం మార్చుకుంటూ కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూనే ఉంది. భారత్ లో లక్షల కేసులకు.. వేల మరణాలకు కారణమైన డెల్టా రకం వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ కు మరో ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ 19 వైరస్ కు సంబంధించిన డెల్టా వేరియంట్ కొత్త అవతారమెత్తింది. ఇది మరోసారి రూపు మార్చుకుంది. ఇప్పుడు కొత్తగా ‘డెల్టా ప్లస్’గా మారింది. ఏవై1 పేరుతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. దీనిపై ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు.
అయితే ఉపశమనం ఇచ్చే వార్త ఏంటంటే భారత్ లో దీని ఉనికి చాలా తక్కువగానే ఉందని తెలిపాడు. దేశంలో ఇటీవలే ఆమోదం పొందిన మోనో క్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ చికిత్స.. ఈ వైరస్ పై పనిచేయడం లేదని వెల్లడైంది.
భారత్ లో వెలుగుచూసిన బి.1.617.2 అనే ‘డెల్టా’ రకం ఇప్పుడు ఉత్పరివర్తనం చెందిన కొత్తగా ‘డెల్టా ప్లస్’ గా మారిందని ఇంగ్లండ్ కు చెందిన ప్రజారోగ్య విభాగం తెలిపింది. ఇప్పటివరకూ తాము ‘డెల్టా +’ రూపాంతర జన్యుక్రమాలు దాదాపు 63 గుర్తించామని ఇవన్నీ జన్యూమార్పును కలిగి ఉన్నాయని సంస్థ చెబుతోంది.
ప్రస్తుతం ఇది భారత్ లో పెద్దగా కనిపించడం లేదు. ఐరోపా, ఆసియా, అమెరికాల్లో ఎక్కువగా వెలుగుచూసింది అని తెలిపారు.