విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు ప్రతిపక్ష టీడీపీకి ఆయుధంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలనుకుంటున్న సీఎం జగన్ ముందరి కాళ్లకు ఈ ప్రమాదాలు బంధం వేస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి నిధులు, విధులు సహా అక్కడ అన్ని చక్కదిద్దుతున్న వేళ వరుస ప్రమాదాలు ప్రభుత్వ నిర్ణయాన్ని పున: సమీక్షించుకునేలా చేస్తున్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి విశాఖలోనే ఉంటూ సచివాలయం, సీఎం క్యాప్ ఆఫీస్ సహా పాలనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ భార్య భారతి కూడా విశాఖకు వచ్చి సమీక్షిస్తున్నారు.
విశాఖ ఎల్జీ గ్యాస్ లీక్ అయ్యి 12మంది మరణించడం తో విశాఖ రాజధాని గా సేఫ్ కాదనే ప్రచారాన్ని ప్రతి పక్షాలు చేపట్టాయి. ఆ తర్వాత తాజా గా మరో ఫార్మా పరిశ్రమ లో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చని పోయారు. ఇలాంటి ప్రమాదాలు విశాఖ లో కామన్. నెలకు ఒకటో రెండో జరుగుతుంటాయి. స్టీల్, పారిశ్రామిక ప్రాంతం లో ఇన్నాళ్లు వీటి పై నజర్ లేదు. అయితే ప్రభుత్వం రాజధాని గా చేయడం తో ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ, మీడియా ఫోకస్ ఎక్కువై చిలువలు పలువలు చేస్తూ విశాఖ రాజధాని గా పనికి రాదంటూ ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులు, ఇతర సచివాలయ సిబ్బంది ని ఇక్కడికి రాకుండా బెదిరిస్తున్నారు.
విశాఖకు సీఎం జగన్ ఎంత త్వరగా వద్దామని అనుకుంటున్నా.. తాజా ప్రమాదాలు కారణంగా మరింత ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయితే జగన్ మాత్రం విశాఖ రాజధానిపై పట్టు వీడడం లేదు. ప్రమాదాలపై అప్రమత్తత, విచారణ కమిటీలు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ప్రమాదాలపై కుట్రకోణం కూడా ఉందని వైసీపీ భావిస్తోంది. అందుకే విశాఖపై నజర్ పెట్టినట్టు తెలుస్తోంది.