అమెరికాలో అధికార మార్పిడి ప్రక్రియ వేగవంతమైంది. ఇటీవల ట్రంప్ మద్దతుదారులు చేసిన రచ్చతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు యూఎస్ కాంగ్రెస్, సెనెట్ వేగంగా సమాయత్తమవుతున్నాయి. ఈ నెల 20వ తేదీన అమెరికా 45వ అధ్యక్షుడిగా జో బిడెన్ బాధ్యతలు స్వీకరించబోతోన్నారు. అయితే.. దీనికి ఒక్కరోజు ముందు అంటే.. 19వ తేదీన ప్రస్తుత అధ్యక్షుడు, అభిశంసన ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేయనున్నారు.
అయితే.. బిడెన్ సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో భారతీయులు కీలక పాత్ర పోషించబోతోన్నారు. బిడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు ఇండియన్-అమెరికన్లు పలు హోదాల్లో నియమితులు అయ్యారు.
తాజాగా.. అదే జాబితాలో మరో ఇండియన్-అమెరికన్ చేరారు. భారత సంతతికి చెందిన మహిళ గరిమా వర్మ.. జో బిడెన్ టీమ్‌లో ఉన్నారు. జో బిడెన్ డిజిటల్ డైరెక్టర్‌గా ఆమె నియమితులు అయ్యారు. ఈ మేరకు జో బిడెన్ కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది. గరిమా వర్మతోపాటు రోరీ బ్రోసియస్ అనే అమెరికన్ ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
గరిమా వర్మ భారత్‌లో జన్మించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబం కాలిఫోర్నియాలోని సెంట్రల్ వ్యాలీలో నివసిస్తోంది. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆమె బిడెన్-హ్యారిస్ క్యాంప్‌లో పనిచేశారు. మీడియా వ్యూహకర్తగా వ్యవహరించారు.
రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు గరిమా.. పారామౌంట్ పిక్చర్స్‌లో పనిచేశారు. అందులో గ్రాఫిక్స్ డివిజన్ హెడ్‌గా ఉన్నారు. అనంతరం ప్రఖ్యాత వాల్ట్ డిస్నీకి చెందిన ఏబీసీ నెట్‌వర్క్‌లో టెలివిజన్ షో హోస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 'హారిజాన్ మీడియా' అనే ఏజెన్సీని నడిపించారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.