అంతరిక్ష యానంలో అద్భుతాలు సృష్టిస్తూ.. ఎలక్ట్రిక్ కార్ల సృష్టికర్తగా పేరొందిన ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. టెస్లా విద్యుత్ కార్లతో వాహన పరిశ్రమ రూపు రేఖలే మార్చిన మస్క్ తాజాగా స్మార్ట్ ఫోన్లపై పడ్డాడు.
ఈ భూమండలంలోనే కాకుండా.. అంతరిక్షం నుంచి చివరికి మార్స్ గ్రహం సైతం హలో అనగలిగే స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించడానికి ఎలన్ మస్క్ రెడీ అయ్యారని తెలిసింది.
ఇప్పటికే మస్క్ 'టెస్లా' విద్యుత్ వాహనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇక 'స్పేస్ ఎక్స్' మిషన్ తో అంగారక గ్రహాన్ని కాలనీగా మార్చాలని నిర్ణయించారు. అందువల్ల ఇప్పుడు ఎలాన్ మాస్క్ తెస్తున్న స్మార్ట్ ఫోన్లు కూడా అద్భుతాలను ఆవిష్కరిస్తాయని అంటున్నారు.
ఎలాన్ మస్క్ తీసుకువస్తున్న టెస్లా మొబైల్ ఫోన్ కు 'పై' స్మార్ట్ ఫోన్ అనే పేరు ఖరారైంది. ఈ ఫోన్లో స్టార్ లింక్ టెక్నాలజీని పొందుపరిచారని.. ఇది అంగారక గ్రహం నుంచి కూడా భూమ్మీదకు మాట్లాడవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ తో అంతరిక్షంలోకి వెళ్లినా అక్కడి నుంచి భూమి మీద ఉన్న వారితో మాట్లాడొచ్చు. ఈ విశ్వంలో ఎక్కడైనా వినియోగించడానికి అనువుగా ఈ ఫోన్ ను తీర్చిదిద్దుతున్నారు. దీంతో మస్క్ తెస్తున్న ఈ ఫోన్ పై భారీ అంచనాలున్నాయి.