ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు.. ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉన్నాడు. తాజాగా పేదలకు ఇళ్ల పంపిణీ కూడా చేపడుతున్నాడు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పంచుతూ ముందుకెళుతున్నాడు. అయితే సడెన్ గా జగన్ స్పీడుకు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు బ్రేక్ వేశారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రస్తుతం నడుస్తున్న పథకాలను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు జగన్ సర్కార్ కు అల్టిమేటం జారీ చేసింది.
సీఎస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ సర్క్యూలర్ జారీ చేశారు. దీంతో ఏపీలో పలు పథకాలతోపాటు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ఆగిపోనుంది.
ఇప్పటికే పంచాయితీ ఎన్నికల ప్రకటనపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హౌస్ మోహన్ పిటీషన్ దాఖలు చేసింది.దీనిపై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. పంచాయితీ ఎన్నికల బంతి హైకోర్టు చేతిలో ఉంది. కోర్టు ఆదేశించినా సీఎం జగన్ నిర్వహించే పరిస్థితుల్లో లేరు. దీనిపై సుప్రీంలో సవాల్ చేస్తారు. దీంతో ఏపీలో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.