ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదానికి ఈ రోజు సుప్రీం కోర్టు ఓ దారి చూపింది. ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని , ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని చెప్తూ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చి ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి సంచలన లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ రాశారు. ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు చెప్పిందని.. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయన్నారు. అందుకే కేంద్రం నుంచి సిబ్బందిని కేటాయించాలని లేఖలో కోరారు. ఎన్నికల కమిషనుకు ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ అప్పజెప్పామని కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నామని కేంద్రానికి లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సేవలకు అనుమతివ్వండి అని ఆయన లేఖలో కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటామని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పందించారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగులంతా, ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చెప్పలేదని, ఆరోగ్యం సరిగాలేని ఉద్యోగులను మినహాయించి, మిగిలిన వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్నారు. ఉద్యోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
తాము ఎన్నికలపై తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రభుత్వం, ఎస్ ఈసీ చెప్పేదానిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌కు తాము వ్యతిరేకం కాదని.. తీర్పు పూర్తి కాపీ చూశాక స్పందిస్తామన్నారు, మొత్తంగా ఈ స్థానిక ఎన్నికల వ్యవహారంపై ఏపీలో హాట్ హాట్ గా చర్చ్ జరుగుతుంది.