టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కింద పడ్డా పైచేయి తనదే అని చెప్పుకునే రకమనే చెప్పాలి. ఎందుకంటే... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయిన డేటా చోరీ కేసుకు సంబంధించి దాదాపుగా అడ్డంగా బుక్కై కూడా ప్రత్యర్థులపై ఆయన తనదైన శైలి బెదిరింపులకు దిగుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏపీ ప్రజలకు చెందిన సమగ్ర వివరాలన్నీ టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న ఓ ఐటీ సంస్థ వద్ద ఉన్నాయన్న విషయంపై వైసీపీ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది కూడా ఏపీ ప్రజలకు చెందిన వివరాలు తెలంగాణలోని ఐటీ కంపెనీకి.... అది కూడా గుట్టుచప్పుడు కాకుండా గల్లీల్లో కార్యాలయం పెట్టుకుని గుట్టుగానే పనులు చక్కబెట్టుకుంటున్న కంపెనీకి ఈ వివరాలు ఎలా అందాయని ప్రశ్నించడమే పాపమైపోయినట్లు చంద్రబాబు ఇప్పుడు నానా హైరానా పడుతున్నారు.
సదరు ఐటీ కంపెనీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం - తెలంగాణ పోలీసులు వెంటనే దానిపై కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించడం - సోదాల్లో సదరు కంపెనీ అక్రమాలకు పాల్పడ్డట్టుగా ప్రాథమిక ఆధారాలు లభ్యమవడం.. తదితర పరిణామాలతో చంద్రబాబు అండ్ కో అలర్ట్ అయిపోయారు. కేసు కోర్టు పరిధిలో ఉందన్న విషయాన్ని కూడా విస్మరించేసి సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు దీనిపై నానా రచ్చ చేశాయి. ఇందులో భాగంగానే నేడు తన సొంత జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... కాసేపటి క్రితం మదనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ విషయంపై తనదైన శైలి అక్కసును వెళ్లగక్కారు. తమ పార్టీ డేటాను అప్ డేట్ చేస్తుంటే... కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరంటూ చంద్రబాబు ఓ రేంజిలో ఫైరైపోయారు. అంతటితో ఆగని చంద్రబాబు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు - తెలంగాణ ప్రభుత్వం - ఫిర్యాదు చేసిన వైసీపీలకు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు... మిమ్మల్ని వదిలిపెట్టను - నా జోలికి వస్తే వదిలేది లేనే లేదు అంటూ ఒంటికాలిపై లేచారు.
ఈ దిశగా చంద్రబాబు ప్రసంగం ఎలా సాగిందన్న విషయానికి వస్తే... *టీడీపీని దెబ్బతీయాలనుకుంటే మీ మూలాలను కదిలిస్తా. కాంగ్రెస్ కాలంలో ఇలాంటి పరిస్థితి లేదు. పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నేనే తెచ్చా. మీరు వాడే సెల్ ఫోన్ కూడా నేనే కనిపెట్టాను. రాష్ట్ర విభజనతో ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం. అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యేలేదు. ఎంతమంది కలిసినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మీ ఆటలు సాగనివ్వను. 37ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉంది. కేసీఆర్ నన్ను ఓడిస్తామంటున్నారు. ఆంధ్రాలో టీఆర్ ఎస్ పార్టీ లేదు. ప్రధాని మోదీతో కలిసి ఆయన ఇలా బెదిరిస్తున్నారు. అందుకే మీకు రోషం రావాలి.’ అంటూ చంద్రబాబు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.