ఏపీలో మరో ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో కర్నూలు పట్టణానికి దగ్గర్లో ఉండే ఓర్వకల్లు నుంచి ప్యాసింజర్ విమానాలు ఎగరనున్నాయి. తాజాగా ఈ ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేసే కార్యక్రమం పేరుతో రెండోసారి అట్టహాసంగా ప్రారంభించారు. గతంలో ఈ ఎయిర్ పోర్టును రెండున్నరేళ్ల క్రితమే అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సరైన రన్ వేను నిర్మించకుండా.. ఎయిర్ పోర్టు పూర్తి కాకుండానే ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు బాబు హడావుడిగా దీన్ని స్టార్ట్ చేశారన్న పేరుంది.
ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా ప్రారంభమైన ఎయిర్ పోర్టు కోసం వంద ఎకరాల్ని ఇచ్చిన ఓర్వకల్లు గ్రామస్తుల భావోద్వేగాలు గాయపడేలా తాజా ఓపెనింగ్ జరిగిందన్న విమర్శ వినిపిస్తోంది. విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా తయారు చేయించిన శిలాఫలకంలో ఓర్వకల్లు పేరు లేకపోవటాన్ని వారు తప్పుపడుతున్నారు. భూములు ఇచ్చిన రైతులు.. స్థానిక ప్రజల అభిమానాన్ని దెబ్బ తీసేలా అధికారుల తీరు ఉందంటున్నారు.
ఎక్కడైనా లోకల్ చంటిగాడికి ప్రాధాన్యత లభించాల్సిందే. అందుకు భిన్నంగా శిలాఫలకంలో లోకల్ ను విస్మరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఓర్వకల్లు గ్రామ సర్పంచ్ తోట అనూషను అనుమతించకపోవటమేకాదు.. ఆమె పేరు శిలాఫలకం మీద లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అయితే.. సర్పంచ్ పేరు లేకపోవటాన్ని తాము గుర్తించామని.. ప్రోటోకాల్ లో భాగంగా ఆమె పేరు ఉండాలని.. ఆ తప్పును సరిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ఒక వివరణను జారీ చేశారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఓర్వకల్లు గ్రామం పేరు.. గ్రామ సర్పంచ్ పేర్లను మర్చిపోయిన అధికారులు.. కన్నమడకల.. పూడిచర్ల గ్రామ సర్పంచ్ పేర్లను మాత్రం రాయటాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి పరిణామాలత.. ఓర్వ కల్లు గ్రామస్తులు గరంగరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయినా.. లోకల్ చంటిగాళ్లను అంతలా నిర్లక్ష్యం చేస్తే ఎలా?