ప్రభుత్వ లెక్కల చిక్కుల్లో ఉద్యోగులు: పాత జీతమే కావాలంటున్న ఉద్యోగులు

Update: 2022-01-25 05:34 GMT
ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య రగడ మరింత పెద్దదవుతోంది. మొన్నటి వరకు పీఆర్సీ కోసం కొట్లాడిన ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పీర్సీ లెక్కల్లో చిక్కులు చాలా ఉన్నాయని అందోళన చెందుతున్నారు.

ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం చేసిన హడావుడితో మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. అయితే నిన్నటి వరకు ఫిట్మెంట్ పెంచాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు ఇప్పుడు మాకసలు కొత్త జీతాలే వద్దు.. పాత జీతాల ప్రకారమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీతో జీతంలో కొత పడడమే కాకుండా శాశ్వతంగా తీవ్రంగా నష్టపోతామని గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా పాత జీతమే చెల్లించాని సమ్మె చేస్తుండడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

సాధారణంగా  ఏ ఉద్యోగులైనా పాత జీతం వద్దని.. కొత్త జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. కానీ ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయులది భిన్న పరిస్థితి ఏర్పడింది. తమకు పాత జీతమే చెల్లించాలని అంటున్నారు. 11 వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించిన ఫిట్మెంట్,

హెచ్ఆర్ఏ విధి విధానాలను రూపొందిస్తూ ఈనెల 17న ప్రభుత్వం  జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. 2019 జూలై నుంచి మూలవేతనంపై 27 శాతం ఐఆర్ ప్రకటించి 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం కల్పిస్తామని, ఇదే సంవత్సరం జనవరి జీతంతో కలిపి నగదు రూపంలో వేతనాలు చెల్లిస్తామని పేర్కొంది.

ఇక కొత్త పీఆర్సీలో ఫిట్మెంట్ ను 23 శాతాన్ని తగ్గించింది.   దీని ప్రకారం ఇప్పటికే ఉద్యోగులు అదనంగా తీసుకున్న ఐఆర్ మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని డీఏ బకాయిల నుంచి మినహాయిస్తామని తెలిపింది.

అలా మినహాయించిన తరువాత కూడా ఉద్యోగులు ప్రభుత్వానికి బకాయిలు ఉంటే వాటిని జీపీఎఫ్ ఖాతాలను జమ చేస్తామని పేర్కొంది. దీని ప్రకారం  ఉద్యోగులు ప్రభుత్వానికి బకాయిలు పడితే తిరిగి ఇతర రూపంలో చెల్లించాలన్న మాట. ఈ నేపథ్యంలో వారి జీతంలో కోత పడనుంది. అయితే ఇది శాశ్వతంగా ఉండడంతో చేతికొచ్చే జీతం తక్కువగా ఉంటోంది. దీంతో తమకు కొత్త జీతం వద్దని,పాత జీతమేకావాలని ఆందోళన చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు మాత్రం అనవసరంగా రద్దాంతం చేస్తున్నారని, ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేసిందని అంటున్నారు.

అయితే  ప్రభుత్వం లెక్కల యాయలో ఉద్యోగులు చిక్కుకున్నారని కొందరికి అర్థమైంది. మరికొందరు మాత్రం అర్థం కావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు రెండు వర్గాలు విడిపోతున్నాయి. వీరిలోకొందరు ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంటే.. మరికొందరు సమ్మెకు దిగుతున్నారు. మొత్తానికి మొన్నటి వరకు జీతం పెంచుమని ఆందోళన చేసినవారు.. ఇప్పుడు పాత జీతం చెల్లించాలని సమ్మె చేస్తున్నారు.
Tags:    

Similar News