ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. దీంతో శానిటైజర్ కూడా తాగి చనిపోయిన మందుబాబులున్నారు. ఇక పక్కరాష్ట్రంలోని చీప్ మద్యం తెచ్చుకొని ఏపీలో తాగుతున్న వారున్నారు.కానీ ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ దారులు మూసుకుపోయాయి.
ఇటీవల కొందరు హైకోర్టుకు ఎక్కడంతో ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. అయితే ఈ 3 బాటిళ్లపై కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ అభ్యంతరం తెలుపుతోంది.
3 బాటిల్స్ తెచ్చుకోవాలని తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎక్సైజ్ శాఖ సూచించింది. ఈ తీర్పును అడ్డుపెట్టుకొని మద్యం అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని.. ఇతర రాష్ట్రాల నుంచి ఇష్టారీతిన మద్యం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తన నివేదికలో పేర్కొంది.
దీంతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మద్యంప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.