ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు మీద మంచి పట్టుదలగా ఉన్నారు. ఎంతలా అంటే అయితే జగన్ తోనే రద్దు చేయించుకోవాలని. ఆ విధంగా వారు ఆలోచించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏపీలో జగన్ కాకపోతే వచ్చేది చంద్రబాబు సర్కారే. బాబు ఈ విషయంలో నోరు మెదపడంలేదు. పైగా ఆయన 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో కూడా సీపీఎస్ రద్దు మీదనే ఉద్యోగులు ఆందోళనలు చేశారు. అయినా కూడా బాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదని అంటారు.
దానికి కారణం దాని వల్ల ఆర్ధికంగా అతి పెద్ద భారాన్ని నెత్తికెత్తుకోకపోవడమే అని బాబు గుర్తెరగడం వల్లనే అని చెబుతారు. మరి నాడు పాదయత్ర వేళ జగన్ మాత్రం సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చేశారు. తాను సీఎం అయితే కేవలం వారం వ్యవధిలోనే రద్దు మీద సంతకం చేస్తామని కూడా ప్రకటించారు. కానీ జగన్ సీఎం అయి ఈ రోజుకు అక్షరాలా మూడు ఏళ్ళ మూడు నెలల పై దాటింది.
సీపీఎస్ రద్దు ఊసు లేదు. మొదటి రెండేళ్ళూ కరోనా వల్ల ఇతర కారణాల వల్ల ప్రభుత్వానికి టైం ఇచ్చి ఊరుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు మాత్రం ఈ అంశం మీద తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటోంది. ఇప్పటి నుంచి అగ్గి రాజేసే కనీసం ఎన్నికలకు ముందు అయినా జగన్ సీపీఎస్ రద్దు ఫైల్ మీద సంతకం పెడతారు అని ఆలోచిస్తోందిట.
అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయంటే సీపీఎస్ రద్దు అంటే తడిసి మోపెడు అవుతుందనే భావనతో ఉన్నారని అంటున్నారు. దాంతో ఉపాధ్యాయ దినోత్సవం వేళ జగన్ అయితే పెన్షన్ గురించి కీలక అంశాలనే చెప్పారు. తాము పెన్షన్ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేయాలనుకుంటున్నామని అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని అదే సమయంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం తో ముందుకు వస్తామని ఆయన వివరించారు.
అంటే ఉద్యోగులు కోరుతున్నట్లుగా ఓల్డ్ పెన్షన్ స్కీం కాకుండా గ్యారెంటీ పెన్షన్ స్కీం తోనే ప్రభుత్వం ముందుకు వస్తుంది అని అంటున్నారు. అంటే అటు ఉద్యోగులు కోరుకున్నది కాకుండా ఇటు తమ మాట తప్పకుండా మధ్యేవాదాన్నే వైసీపీ ఎంచుకుంది అని అర్ధమవుతోంది. అయితే ఉద్యోగులు మాత్రం ఓపీఎస్ కే మొగ్గు అంటున్నారు. తమకు జీపీఎస్ అన్నది ససేమిరా ఇష్టం లేదని వారు చెబుతున్నారు.
దానికి తాజా ఉదాహరణ మంత్రి బొత్స సత్యనారాయణ తో జరిగిన ఉద్యోగ సంఘాల చర్చలలో కూడా మధ్యలోనే వారు వచ్చేశారు. తాము ఓపీఎస్ అని అంటూంటే సర్కార్ జీపీఎస్ అని చెబుతూ చర్చలకు పిలవడం ఏంటి అని ఉద్యోగులు అంతున్నారు. మొత్తానికి ఈ విషయంలో మాత్రం అతి పెద్ద పీట ముడి అయితే ఉద్యోగులతో సర్కార్ కి పడిపోయింది అని అంటున్నారు.
ఇక ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందా. దీన్ని సర్కార్ పరిష్కరిస్తుందా అంటే మరో ఏడాదిలోగానే ఇది పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదేలా అంటే ఎన్నికలు అప్పటికి దగ్గరకు వస్తాయి. అదే టైం లో వైసీపీ కూడా తనకు ఉన్న విజయావకాశాలను బేరీజు వేసుకుంటుంది అని అంటున్నారు. ఒకవేళ టీడీపీ బాగా పుంజుకుని టైట్ ఫైట్ కనుక ఏర్పడితే ఉద్యోగులను మొత్తానికి మొత్తంగా తమ వైపునకు తిప్పుకోవడానికి ఓపీఎస్ ని ఆయుధంగా చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇలాంటి ఆశలు ఉండబట్టే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము వెనక్కి తగ్గమని అంటున్నారు. ఏది ఏమైనా సీపీఎస్ రద్దు అన్నది వైసీపీ టైం లోనే జరుగుతుంది అన్న మాట అయితే వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.