మండలి రద్దు విషయం లో నిస్ఫాక్షిం గా అభిప్రాయాలను చెప్పే నిపుణులు కూడా కనిపించడం లేదు. ఈ విషయంలో రెండు రకాలుగా స్పందిస్తున్నారు అవగాహన ఉన్న వారు కూడా. ఒకరేమో మండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయం చాలని, రాజ్యాంగంలో ఆ విషయాన్నే పేర్కొన్నారని.. ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర స్థాయి సభ నిర్ణయం మేరకు మండలి రద్దు అవుతుందని వారు చెబుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా కేంద్రం అనుమతి అవసరం లేదని అంటున్నారు. మండలి చేసి పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుందన్నారు. గతంలో ఎన్టీఆర్ పెద్దల సభను రద్దు చేస్తూ పంపిన తీర్మానాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆమోదించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మండలి రద్దు కాంగ్రెస్ కు నష్టం చేకూర్చిన అంశం. అయినా అప్పట్లో రాజీవ్ ప్రభుత్వం అందుకు అనుగుణం గానే నిర్ణయం తీసుకుందని వారు ప్రస్తావిస్తూ ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు మండలి రద్దు విషయంలో మోడీ ప్రభుత్వం మోకాలడ్డే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇక రెండో వర్గం వారు.. మరో వాదన చేస్తూ ఉన్నారు. మండలి రద్దును కేంద్రం ఆమోదిస్తుందని అంటూనే.. మరో వైపు అది అంత తేలిక కాదు అని అంటున్నారు.
వీరిలో జగన్ అంటే పడని వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు ఉన్నారు. మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఆమోదించినా.. అది కేంద్రం వద్ద ఆమోదం పొందడం సులువు కాదని ఈ వర్గం మేధావులు అంటున్నారు. వీరిలో రాజకీయ నేతలు, న్యాయనిపుణులు ఉన్నారు. అయితే వీరంతా కాంగ్రెస్ కో, బీజేపీకో, తెలుగుదేశానికో చెందిన వాళ్లు!
వీళ్లు మండలి రద్దు కు పట్టే సమాయన్ని కూడా కొలత వేస్తున్నారు. ఒకరేమో ఆరు నెలలు అంటే, మరి కొందరు సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు అని కూడా అంటున్నారు. అంత వరకూ మండలి పనిచేస్తుందని, మండలి సమావేశం అవుతుందని, తను చేయాలనుకున్నది చేస్తుందని వీరు అంటున్నారు.
మరి ఎవరిది రైటో.. ఎవరిది రాంగో.. ఇంతకీ మండలి ఎప్పటి వరకూ కొనసాగుతుందో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.