ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.త్వరలో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని మార్పు.. మూడు చోట్ల రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్న అంశంపై ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యం లో ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాసింది జగన్ సర్కార్.
ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖ లో.. అమరావతి పరిధిలోని గ్రామాలకు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయించాలని కోరింది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. దీనికి కారణం.. అమరావతి ప్రాంతం లో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన గా చెబుతున్నారు.
ఎర్రపాలెం.. బేతపూడి.. నవులూరులను మంగళగిరి మున్సిపాలిటీల్లో కలపాలని.. పెనుమాక.. ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీ లో కలపాలన్న ప్రతి పాదనగా చెబుతున్నారు. మిగిలిన గ్రామాల్ని కలిపేసి అమరావతి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్న అంశం మీద సర్కారు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఏ మాత్రం సరికాదన్న ఆలోచన నేపథ్యంలో జగన్ సర్కారు తాజా లేఖ రాసినట్లు గా చెబుతున్నారు.