మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

Update: 2019-09-25 09:28 GMT
ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీల అమలుకు కంకణం కట్టుకున్నారు. వారిని నెరవేర్చడానికి పూనుకుంటున్నారు. ఆ కోవలోనే ఎన్నికల ముందర ఇచ్చిన ‘మద్యం నిషేధం’ హామీ అమలుకు తాజాగా సీఎం జగన్ నడుం బిగించారు. ఒకేసారి మద్య నిషేధం చేస్తే ఇబ్బందులు వస్తాయని గ్రహించి దశల వారీగా.. తగ్గించుకుంటూ సంపూర్ణ మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కఠిన నిబంధనలు పొందుపరిచింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యక్తి వద్ద ఇక అనుమతి - లైసెన్స్ లేకుండా ఏకకాలం 6 బీరు సీసాలు - 3 మద్యం సీసాలకు మించి ఉండకూడదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేసింది.

ఫారిన్ లిక్కర్ అయినా స్వదేశీ లిక్కర్ అయినా ఏ పరిణామాలోనిది అయినా 3 సీసాలకు మించి ఏ వ్యక్తి దగ్గర ఉంచుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏ వ్యక్తి వద్ద 6 బీర్లకు మించి ఉండకూడదని స్పష్టం చేసింది.

ఇక మెథైలిటేడ్ స్పిరిట్ 3 లీడర్లు మాత్రమే ఉంచుకోవాలని.. తాటికల్లు ను కూడా 2 బల్క్ లీటర్లకు మించి దగ్గర ఉంచుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెక్టిఫైడ్ స్పిరిట్ కు అసలే ఉండకూడదని తెలిపింది. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపింది.

గతంలో రెట్టింపుగా ఉన్న ఈ గరిష్ట పరిమితిని సగానికి తగ్గిస్తూ మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చింది జగన్ సర్కారు. మరి దీనిపై మన మందుబాబులు ఎలా స్పందిస్తారో చూడాలి.
    

Tags:    

Similar News