టీటీడీ బోర్డు నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. ప్రభుత్వ జీవో సస్పెండ్

Update: 2021-09-22 06:57 GMT
ఏపీ ప్రభుత్వం వేసిన టీటీడీ జంబో పాలక మండలి సభ్యుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవల జంబో పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 31 మంది సభ్యులతోపాటు మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జీవోలను కూడా జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై హైకోర్టులో మూడు పిటీషన్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ పిటీషన్ల తరుఫున న్యాయవాదులు వాదించారు. దీనివల్ల సామాన్య భక్తులపై భారం పడుతుందని వివరించారు.

ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుపట్టింది. అలాగే టీటీడీ బోర్డు నిర్ణయంపై సీరియస్ అయ్యింది.ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.
Tags:    

Similar News