ఎన్నికల కమిషనర్ కి ఆ అధికారం ఎక్కడిది... ఎన్నికలతో వలంటీర్లకు సంబంధంలేదు !
ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతుండటంతో అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పలువురు అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్ధించారు. దీనిపై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. అలాగే ఈ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై కూడా వాదనలు ముగిశాయి.
పిటిషనర్ల తరఫున వీఆర్ రెడ్డి, ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వడం ఏపీ మున్సి’పాలిటీల చట్టానికి విరుద్ధం అని , కరోనా కారణంగా గత ఏడాది ఎన్నికల ప్రక్రియను ఆపేశారని ,ఆ సమయంలో ఒకే నామినేషన్ వచ్చిన చోట అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటిస్తామని అప్పట్లో ఎన్నికల కమిషనర్ తెలిపారని, అయితే, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ జరిగిన వ్యక్తుల, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వ్యక్తుల నామినేషన్లను పునరుద్ధరించాలంటూ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ ఇటీవల ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఇలా చేసే అధికారం ఎన్నికల కమిషనర్ కు లేదన్నారు. ఒకవేళ పిటిషనర్ల నామినేషన్లపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా ఏర్పాటైన ఎన్నికల ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విశేషాధికారాల పేరుతో ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషనర్ అధికారాలకూ పరిమితులు ఉన్నాయని, ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయన్నారు.
రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే ఎన్నికల అధికారులు ఓ సారి నామినేషన్లు ఆమోదించిన తర్వాత అందులో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, ఎన్నికల అధికారే సుప్రీం అని హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది అని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేలినా వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్ కు వెళ్లాలని చట్టం చెబుతోందన్నారు. ఎన్నికల ట్రిబ్యునల్ చేయాల్సిన పనులను ఎన్నికల కమిషనర్ చేయడానికి వీల్లేదన్నారు. అన్నీ ఎన్నికల కమిషనరే చేసేస్తే, ఇక ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయి అని ఎన్నికల కమిషనర్ నిర్ణయిస్తే ఇక ట్రిబ్యునల్ ఎందుకు అని ప్రశ్నించారు. అయితే , ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినప్పుడు వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌కు విశేషాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 14 చోట్ల నామినేషన్ల దాఖలుకు అనుమతినిచ్చామని, అయితే కేవలం 4 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. దీనిపై ఈ రోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.
అలాగే, మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల పై విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ వలంటీర్లు ఓటర్ స్లిప్పులను పంచుతున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. బ్లాక్ స్థాయి అధికారులే ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని, వలంటీర్లకు ఎన్నికలతో సంబంధం ఉండదని చెప్పారు. వలంటీర్ల వద్ద కేవలం తమ పరిధిలో ఉండే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉంటాయి తప్ప, పౌరులందరి సమాచారం ఉండదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వలంటీర్లకు మొబైల్ ఫోన్లు ఎంతో ముఖ్యమని, వాటిలోనే లబ్ధిదారుల సమాచారం ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు లేకుండా వారు సంక్షేమ పథకాలను అమలు చేయలేరని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థను స్తంభింప చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు. అంతకుముందు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల తీరుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇతర పార్టీల సానుభూతిపరులకు ఓటర్ స్లిప్పులు ఇవ్వడం లేదన్నారు. పౌరుల సమాచారం మొత్తం వలంటీర్ల వద్ద ఉంటుందన్నారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, వలంటీర్ల వద్ద ఉన్న డేటా దుర్వినియోగం అవుతుందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వం వద్ద పౌరుల సమాచారం ఉంటుందని, దాన్నెలా తప్పు పట్టగలమని ప్రశ్నించారు.