ఏపీ హైకోర్టు సంచ‌లన నిర్ణ‌యం: ‌లాక్‌ డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేల‌పై కేసులే

Update: 2020-05-29 07:00 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మంత్రులు - ఎమ్మెల్యేలు - ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు కూడా అదే విధంగా త‌యారయ్యారు. ఈ విష‌యాన్ని గుర్తించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌ డౌన్ ఆంక్షలు - నిబంధ‌నలను ఉల్లంఘించే వారు ఎంత‌టి వారైనా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్ అమలు చేస్తుంటే ప్ర‌జ‌లు బాధ్య‌త‌తో ఉండాల‌ని - ప్రతీఒక్కరూ పాటించాల‌ని సూచించింది.

సాక్షాత్తు ప్రజాప్రతినిధులే లాక్‌ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నార‌ని కిశోర్ అనే వ్య‌క్తి హైకోర్టులో పిటిష‌న్ వేశారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించకపోవడం - ఆంక్షలను ఉల్లంఘించార‌ని ఏపీ మంత్రితోపాటు ఏడుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిల్ వేశారు. లాక్‌డౌన్ సమయంలో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో మొత్తం ఎనిమిది వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేప‌ట్టింది.

ఏపీలో లాక్‌ డౌన్ ఉల్లంఘించిన ఎవరి మీదైనా కేసు నమోదు చేయాలని హైకోర్టు ఈ సంద‌ర్భంగా ఆదేశాలిచ్చింది. ఎవరైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో.. వారి మీద డిజాస్టర్ మేనేజ్‌ మెంట్ వారికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌ లకు హైకోర్టు సూచించింది. ఫిర్యాదు స్వీక‌రించి తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Tags:    

Similar News