ఏపీ మంత్రులు వాళ్ల‌ను బ‌లి ప‌శువుల‌ను చేసేస్తున్నారా...!

Update: 2022-09-20 01:30 GMT
రాష్ట్రంలో వైసీపీ నాయ‌కులు.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో కార్య‌క‌ర్త‌ల‌తోపాటు.. అధికారుల‌ను కూడా వారు తీసుకువెళ్తున్నారు. ఎక్క‌డికక్క‌డ ప్ర‌జ‌లు ఏదైనా ప్ర‌శ్నిస్తే.. వాటికి స‌మాధానం చెప్పేందుకు అధికారుల‌ను వారు పిలుస్తున్నారు. కొన్నాళ్ల వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు. ఈ విష‌యంలో చాలా మంది అధికారులు జంకుతున్నారు. సార్‌.. మేం వ‌స్తాం.. కానీ.. బ‌లిచేయొద్దు!! అని వారు వేడుకుంటున్నారట‌.  

దీనికి కార‌ణం.. ఏంటా అని..కొంచెం లోతుగా ప‌రిశీలిస్తే.. మంత్రుల ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌జ‌లు అనేక విష‌యా ల‌ను నిల‌దీస్తున్నారు. తాము అర్హుల‌మైనా.. త‌మ‌కు ప‌థ‌కాలు ఇవ్వ‌డం లేద‌ని.. కొంద‌రు.. ఇచ్చిన ప‌థ‌కాల‌ను కూడా తొల‌గిస్తున్నార‌ని.. మ‌రికొంద‌రు.. ఇలా చాలా మంది చెప్పుకొస్తున్నారు.

కొంద‌రు అయితే.. మంత్రుల‌ను కూడా నిల‌దీస్తున్నారు. దీంతో మంత్రులు వారికి స‌మాధానం చెప్పుకోలేక ..  ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తులు తెలిసిందే.

అయితే.. క‌ర్నూలు, అనంత‌పురం.. జిల్లాల్లో ఒక‌రిద్ద‌రు మంత్రులు చాలా తెలివిగా త‌ప్పించుకుంటున్నార ట‌. ప్ర‌జ‌లు త‌మ‌ను ప్ర‌శ్నిస్తే.. వెంట‌నే వారు.. త‌మ త‌ప్పులేద‌ని..  తాము అంతా క్లియ‌ర్‌గా ఉన్నామ‌ని.. చెబుతున్నార‌ట‌. అంతేకాదు.. జ‌గ‌న్ ఆదేశాల‌ను తాము తూచ‌.. త‌ప్ప‌కుండా పాటిస్తున్నామ‌ని కూడా చెబుతున్నార‌ట‌. ఇక‌, ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు.. వారిలో ఆగ్ర‌హాన్ని త‌గ్గించేందుకు.. మాత్రం.. వెంట‌నే.. ప‌క్క‌నే ఉన్న అధికారుల‌పై నెపం నెట్టేస్తున్నార‌ట‌. ఇదే విష‌యం ఇటీవ‌ల రెవెన్యూ అధికారుల సంఘం చ‌ర్చ‌కు తెచ్చింది.

"మంత్రులు.. ఎమ్మెల్యేలు ఏం చేయాల‌ని ఆదేశిస్తే.. అదేచేస్తున్నాం. కానీ, వారు ప్ర‌జ‌ల ఆగ్ర‌హం నుంచి త‌ప్పించుకునేందుకు మ‌న‌పైనెపం వేస్తున్నారు. ఈ విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి" అని విజ‌య‌వాడ వేదిక‌గా జ‌రిగిన స‌మావేశంలో తీర్మానం చేసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే త‌మ డిమాండ్లు ప‌రిష్క‌రించ‌డం లేద‌ని.. ఈ విష‌యంలో మంత్రులు సైతం మౌనంగా ఉన్నార‌ని.. కానీ.. ఏదైనా ప్ర‌జ‌ల్లో తేడా వ‌స్తే.. మాత్రం త‌ప్పుల‌న్నీ.. అధికారుల‌వే అన్న‌ట్టుగా మాట్లాడుతున్నార‌ని.. వారు వాపోతున్నారు. ఇదీ.. సంగ‌తి!! మ‌రి దీనిపై  సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News