ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఏపీని 26 జిల్లాలుగా మార్చాలన్న ఆలోచనలో జగన్ సర్కారు ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారీ కసరత్తు జరిగింది. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలకు సంబంధించి ప్రతిపాదిత కొత్త జిల్లాలు.. వాటి విస్తీర్ణం.. జనాభాకు సంబంధించి భారీ కసరత్తునే చేశారు. తాజాగా దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ తమ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి తీసుకెళ్లింది. ఈ లెక్కన చూసినప్పుడుకొత్త జిల్లాల్లో కొట్టొచ్చిన కనిపించే అంశాలు చాలానే ఉన్నాయి.
కొత్త జిల్లాల్ని చూస్తే.. జనాభా పరంగా పెద్ద వ్యత్యాసాలు కనిపించవు. ఒక్క అరకు రెండుజిల్లాల్ని మినహాయిస్తే.. మిగిలిన 24 జిల్లాల్లో 17.35 లక్షల జనాభాతో మచిలీపట్నం కాస్త తక్కువగా కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో దాదాపు 18 లక్షల నుంచి 21 లక్షల లోపే కనిపిస్తాయి. ఒక్క విజయవాడ జిల్లా మాత్రం 22.18 లక్షలుగా కనిపిస్తాయి. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాలుగా అరకు 1.. అరకు 2 జిల్లాలు కనిపిస్తాయి. అరకు 1లో 9.72లక్షల జనాభా ఉంటే.. అరకు 2లో 9.53 లక్షల జనాభా కనిపిస్తుంది.
కాకుంటే.. విస్తీర్ణం పరంగా చూస్తే.. అరకు 1లో 3,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమే ఉంటే..జనాభాలో తక్కువగా ఉంటే అరకు 2 జిల్లాలో మాత్రం భూవిస్తీర్ణ భారీగా ఉంది. ఏకంగా 12,251 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఒక విధంగా చూస్తే.. రాష్ట్రం మొత్తంలో అతి పెద్ద జిల్లా విస్తీర్ణాల్లో రెండోదిగా నిలుస్తుంది. మొదటిస్థానం ఒంగోలుగా చెప్పాలి. ఈ ప్రతిపాదిత జిల్లాలో విస్తీర్ణం 13,407 చదరపు కిలోమీటర్లు.
విస్తీర్ణం విషయంలో కొత్త జిల్లాల్లో చాలానే వ్యత్యాసాలు కనిపిస్తాయి. అత్యధిక జిల్లాలు 5వేల చదరపుకిలోమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న జిల్లాలే కావటం గమనార్హం. మరింత లోతుగా చూసినప్పుడు.. ఈ తేడా ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. కొత్తజిల్లాల్లో అతి తక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లాగా విశాఖను చెప్పాల్సి ఉంటుంది. ఈ కొత్త జిల్లా కేవలం 1503 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. కాకుంటే.. అధిక జనాభా ఉన్న జిల్లాగా చెప్పాలి. ఈ ప్రతిపాదిత జిల్లాలో 20.61లక్షల మంది ఉండటం గమనార్హం.
విస్తీర్ణాల ఆధారంగా ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లోకి వెళితే..
2వేల లోపు చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- విశాఖపట్నం 1503
3 వేల లోపు చ.కి.మీ. ఉన్న జిల్లాలు
- నరసాపురం 2178
- గుంటూరు 2443
- కాకినాడ 2605
- అమలాపురం 2615
- రాజమండ్రి 2709
4 వేల లోపు చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- విజయవాడ 3316
- మచిలీపట్నం 3775
- శ్రీకాకుళం 3888
- అరకు 1 3935
- విజయనగరం 3973
5 వేల లోపు చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- అనకాపల్లి 4413
- బాపట్ల 4744
7 వేల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- ఏలూరు 6413
8 వేల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- చిత్తూరు 7044
- కర్నూలు 7281
- నరసరావుపేట 7298
10 వేల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- తిరుపతి 9155
- హిందూపురం 9502
- అనంతపురం 9628
- రాజంపేట 9944
11 వేల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- నంద్యాల 10381
- కడప 10723
13 వేల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- అరకు 12,251
14 వేల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న జిల్లాలు
- ఒంగోలు 13,407