వచ్చేశాయ్ స్థానిక ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

Update: 2020-03-07 07:24 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లకేలకు మొదలయ్యాయి. ఏపీలో స్థానికల ఎన్నికల ప్రకటన శనివారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో స్థానిక పోరుకు తెరలేచింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఒకేసారి షెడ్యూల్ విడుదలవడం విశేషం. ప్రకటన విడుదల అవడం తో వెంటనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్ నియామవళి అమల్లోకి వచ్చింది. ఈ రెండు ఎన్నికలు మార్చిలోనే నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. 23న మున్సిపల్ , 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 660 జెడ్పీటీసీ, 9,639 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి జగన్ అనుకున్న ప్రకారం ఈ నెలాఖరులోపు అన్ని ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.

ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం విశేషం. 23న మున్సిపల్ , 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈనెల 27, 29న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి 29న ఫలితాలు వెల్లడిస్తారు.

ఎన్నికల షెడ్యూల్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల, 9 నుంచి 11 వరకు: నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన, 14న ఉపసంహరణ, 21న పోలింగ్‌, 24న ఫలితాలు

మున్సిపల్‌ ఎన్నికలు:
9 నోటిఫికేషన్‌ విడుదల, 11నుంచి 13 నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16న ఉప సంహరణ, 23న పోలింగ్‌, 27న ఫలితాలు

పంచాయతీ ఎన్నికలు
తొలి విడత: 15వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలవుతుండగా మార్చి 17నుంచి 19 నామినేషన్లు స్వీకరిస్తారు, 20న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ, 27న పోలింగ్‌, 27 ఫలితాల వెల్లడి.

రెండో విడత: 17వ తేదీ నోటిఫికేషన్‌ విడుదల చేసి 19నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ, 29న పోలింగ్‌, 29 ఫలితాలు.
Tags:    

Similar News